Home » దీపావళి.. మనందరి జీవితాల్లోనూ వెలుగుల్ని నింపాలి.!

దీపావళి.. మనందరి జీవితాల్లోనూ వెలుగుల్ని నింపాలి.!

by Mudra369 Editorial Desk
0 comments
Happy Diwali

Happy Diwali 2020 Mudra369.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హిందువులు జరుపుకునే పండుగల్లో విజయదశమి తర్వాత, దీపావళి అత్యంత ప్రత్యేకమైనది.!

చీకట్లను పారద్రోలి, జీవితాల్లో వెలుగుల్ని నింపాలని ఆకాంక్షిస్తూ దీపావళి పండుగని జరుపుకుంటుంటాం.!

దీపావళి అంటే, కేవలం దీపాల వెలుగులు మాత్రమే కాదు.. బాణాసంచా కాల్చడం ద్వారా ‘చెడుపై మంచి సాధించిన విజయాన్ని’ ప్రపంచానికి చాటి చెప్పడం కూడా.!

గత కొంతకాలంగా, ఈ బాణాసంచా తయారీ, విక్రయం, వినియోగించడంపై ఆంక్షలు పెరుగుతూ వస్తున్నాయి. వివాదాలూ సర్వసాధారణమైపోయాయి.

కాలుష్యం పేరు చెప్పి, దీపావళి పండగక్కి వెలుగులు లేకుండా చేయాలన్న కుట్రలూ జరుగుతున్నాయి.

Happy Diwali 2020 Mudra369.. బాణా సంచా.. ఇదొక సంప్రదాయం..

పెరుగుతున్న వాహన కాలుష్యం, పారిశ్రామిక కాలుష్యంపై పెదవి విప్పడానికి ఇష్టపడని ‘మేతావులు’, దీపావళి పండక్కి మాత్రం పొలోమని మీడియా ముందుకొచ్చేసి, పనికిమాలిన విశ్లేషణలు చేస్తూనే వుంటారు.

ఎవరి గోల వారిది.! సంప్రదాయ బాణాసంచా మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం పొందుతున్నాయి. ప్రమాదకర రసాయనాలతో తయారు చేసే కూడిన బాణాసంచా కర్మాగారాల సంగతి సరే సరి.!

దీపావళి అంటే, ఒక్క రోజు పండగ మాత్రమే కాదు.. దీపావళి మొదలుకుని ఐదో రోజున వచ్చే, నాగుల చవితి వరకూ బాణాసంచా కాల్చడం అనేది సంప్రదాయంగా వస్తోంది.

దీపావళికి ముందు నరక చతుర్దశి గురించి తెలుసు కదా.! నరకాసుర వధ నేపథ్యంలోనే, దీపావళి పండుగొచ్చింది.!

కొందరు, కార్తీక మాసం అంతటా ఇంటి ముందర దీపాలు వెలిగించడంతోపాటు, బాణాసంచా కాల్చుతుంటారు.

కార్తీక మాసం అంతటా కాకపోయినా, కార్తీక పౌర్ణమి అలానే కార్తీక సోమవారాల్లో బాణాసంచా వెలుగులు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి.

ఈ దీపావళి సందర్భంగా మనందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ.. దీపావళి శుభాకాంక్షలు.

బాణా సంచా కాల్చేటప్పడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group