బాలీవుడ్ నటి రాధికా ఆప్టేకి (Radhika Apte Hot) పెళ్ళయి చాలా ఏళ్ళే అవుతోంది. ఇంతకీ, ఆమె ఎందుకు పెళ్ళి చేసుకుందట.? ఇప్పుడీ చర్చ ఎందుకట.? అంటే, తాను ఎందుకు పెళ్ళి చేసుకున్నదీ ఓ ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించిన రాధికా ఆప్టే, తద్వారా కావాల్సినంత పబ్లిసిటీ ‘ఫ్రీ’గా పొందుతోంది.
పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో రాధికా ఆప్టే తర్వాతే ఎవరైనా. అసలు విషయానికొస్తే, రాధికా ఆప్టే పెళ్ళి చేసుకున్నది వీసా కోసమట. 2012లో బెనడిక్ట్ టేలర్ అనే మ్యుజీషియన్‌ని రాధికా ఆప్టే పెళ్ళాడింది. లాక్‌డౌన్ నేపథ్యంలో లండన్‌లో భర్త బెనడిక్ట్‌తో ఎంజాయ్ చేస్తోంది రాధికా ఆప్టే.
అప్పట్లో పెళ్ళి చేసుకున్నది వీసా కోసమే అయినా, ఇప్పుడు వైవాహిక బంధాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే వెల్లడించేసరికి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
పెళ్ళయ్యాక పలు సినిమాల్లో హాట్ హాట్‌గా (Radhika Apte Hot) నటించిన రాధిక, కొన్ని సినిమాల్లో అయితే న్యూడ్‌గా కూడా నటించేసింది. ‘ఏం చేసినా, అది సినిమా కోసమే. ఆయా సినిమాల్లో ఆయా సన్నివేశాలకు తగ్గట్టుగా నటించడం నటిగా నా బాధ్యత..’ అని చెప్పింది రాధికా ఆప్టే.
ఏదన్నా సినిమా ఓకే చేసేముందు.. అన్ని విషయాల గురించీ ఆలోచిస్తాననీ, కథ నచ్చితే.. ఎలాంటి బోల్డ్ డెసిషన్స్ అయినా తీసుకోవడానికి తాను సిద్ధమనీ చెప్పుకొచ్చిందీ భామ. మరి, వివాదాల గోలెందుకు.? అని ప్రశ్నిస్తే, ‘నేను ఏదైనా స్ట్రెయిట్‌గానే మాట్లాడతాను.
కొన్నిసార్లు నా మాటలు వక్రీకరించబడతాయి. అలా వివాదాలు తెరపైకొస్తాయి. ఒక్కోసారి నేను స్ట్రెయిట్‌గా మాట్లాడటం కొందరికి నచ్చకపోవచ్చు. అది కూడా వివాదాలకు కారణమేమో..’ అని అభిప్రాయపడింది ఈ స్టన్నింగ్ బ్యూటీ.
తెలుగులో బాలకృష్ణ సరసన రెండు సినిమాల్లో రాధికా ఆప్టే నటించిన విషయం విదితమే. ‘రక్తచరిత్ర’ ఆమెకు తెలుగులో తొలి స్ట్రెయిట్ ఫిలిం.