Table of Contents
Pawan Kalyan Roaring: అదేంటో.! ఆర్నెళ్లకో, మూడు నెలలకో పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ డైలాగ్ పేల్చినా.. దాన్ని తట్టుకోలేక రోజుల తరబడి మొరుగుతూనే వుంటారు కొందరు.
పవన్ కళ్యాణ్‌ని తిడితే తప్ప పూట గడవదు చాలా మంది మీడియా జనాలకి. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత ద్వేషం.? ఈ కడుపు మంటకి చికిత్స లేదా.?
పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అధికార పీటమెక్కి అడ్డంగా దోచుకోలేదు. అక్రమ ఆస్థులు కూడబెట్టి జైలుకెళ్లేలేదు.
చాలా మంది రాజకీయ నాయకులతో పోలిస్తే, నిఖార్సయిన నిప్పు కణిక పవన్ కళ్యాణ్. ఏమో, రేపొద్దున్న అధికారం వస్తే, ఈ అవినీతి రాజకీయంలో ఆయనా ఆ మరకని అంటించుకుంటాడేమో అది వేరే చర్చ.
Pawan Kalyan Roaring సినిమా వినోదం.. రాజకీయం చైతన్యం.!
సినిమాల్లో నటించడం ద్వారా కోట్లాది రూపాయల సంపాదన వస్తుందాయనకి. చట్టబద్ధంగా పన్నులు కడుతున్నాడు.
కొన్ని సినిమాల ద్వారా వినోదం పంచుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా సమాజానికి తన సినిమాల ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.
సినీ రంగంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చూడని హైట్స్ లేవు. ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో పవన్ కళ్యాణ్‌కి తిరుగు లేదు. ఇవన్నీ నిజాలని ఒప్పుకోవడానికి దురదృష్టవశాత్తూ చాలా ధైర్యం కావాలి. రోజులు అలా తగలడ్డాయ్.
రాజకీయ వేదికపై లేదా, సినీ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలు.. గుంపులుగా కొన్ని పెంపుడు జంతువులు మొరగడం మొదలుపెడతాయ్.
మీడియా నాయకుల ముందు కావచ్చు. పత్రికల్లో, ఛానళ్లలో అడ్డగోలు కథనాల రూపంలో కావచ్చు. వెబ్ మీడియాలో ఏడుపు కావచ్చు, సోషల్ మీడియా లో ట్రోలింగ్ కావచ్చు.
విమర్శ తప్పు కాదు.! మొరగడమే నీఛత్వం.!
సరే, రాజకీయాల్లో విమర్శ, ప్రతివిమర్శ వుంటాయ్. ప్రశ్న పేరుతో పవన్ కళ్యాణ్ విమర్శిస్తే, అటు వైపు నుంచి అంతే ఘాటుగా ప్రతి విమర్శ రావడాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ మొరగడం ఏంటీ.? పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడమేంటీ.?
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏది.? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే.. అమరావతి అనో, ఇంకోటనో సమాధానమివ్వాల్సి వుంది.
అది మానేసి, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనో, పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) ప్యాకేజీ తీసుకున్నాడనో ఎదురు దాడి చేస్తారు. ఇదీ నేటి రాజకీయం. ఆ రాజకీయం మాటున వికారపు చేష్టలు ప్రదర్శిస్తున్న మీడియా బాగొతం.
పవన్ కళ్యాణ్‌కి నష్టమేంటి.?
అక్కడ ప్రశ్నించేవాళ్లు లేక సమాజం నష్టపోతోంది. ఇక్కడ ప్రశ్నించినా, ప్రశ్నించకున్నా పవన్ కళ్యాణ్‌కి (Pawan Kalyan) వ్యక్తిగతంగా వచ్చే నష్టమేమీ లేదు. గమ్మునుంటే పవన్ కళ్యాణ్‌కే లాభం.
Also Read: ‘ఆమె’కి వందనం.! మగువా.. నువ్వే ఈ జగమంతా.!
సమాజానికి మేలు చేయాల్సిన మీడియా పవన్ కళ్యాణ్ మీద పుంఖాలు పుంఖాలుగా కారు కూతలు కూయడం ద్వారా రాజకీయం కంటే దారుణంగా సమాజానికి నష్టం కలిగిస్తోంది.
చివరిగా, పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) మీద ఎంతలా మొరిగితే, అన్ని బిస్కెట్లు పడతాయనుకునే పెంపుడు జాగిలాలు అందుకు తగ్గట్లుగా అవసరం వున్నా, అవసరం లేకున్నా చెత్త చెత్త వార్తలతో రోత పుట్టించేస్తున్నాయ్.