Pawan Kalyan Political Money.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన తలచుకుంటే, కోట్లు వచ్చి పడతాయ్.. సినీ నటుడిగా ఆయనకున్న క్రేజ్ అలాంటిది. అంతే కాదు, ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయ్యే అభిమానులు లక్షల్లోనే వున్నారు.
రాజకీయాల్లోకి చాలామంది డబ్బు సంపాదించడానికే వెళ్ళి వుండొచ్చుగాక.!
కానీ, చిరంజీవి (Mega Star Chiranjeevi) అయినా.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అయినా.. సినీ రంగంలో తాము సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు, డబ్బుని రాజకీయాల్లోకి వెళ్ళి ‘తగలెట్టుకున్నారు’, తగలబెట్టుకుంటూనే వున్నారు.
ఓ సినిమాకి పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) దాదాపు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అలాంటప్పుడు, ఆయన ఏడాదికి ఓ సినిమా చేసుకున్నా సరిపోతుంది కదా.? డబ్బు సంపాదన కోసమే అయితే, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎందుకు రాజకీయాల్లోకి వెళతారు.?
Pawan Kalyan Political Money.. పవన్ కళ్యాణ్‌కి డబ్బు సమస్యా.?
ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి దాదాపు 300 కోట్లు అవసరమంటూ, బులుగు మీడియా లెక్కలు తేల్చింది.

అంటే, రాజకీయాల్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎంత కలుషితం చేశాయో, ఈ లెక్కలతో కన్ఫామ్ చేశారన్నమాట.
ప్రధాన రాజకీయ పార్టీలు, ఎన్నికల కోసం ఇంతలా ఖర్చు చేస్తున్నాయనే విషయం తేటతెల్లమైపోయింది.
కాంట్రాక్టర్ల నుంచో, పెట్టుబడిదారుల నుంచో పవన్ కళ్యాణ్ గనుక రాజకీయం పేరుతో డబ్బులు తీసుకోవాలనుకుంటే, 2014 ఎన్నికల్లోనే జనసేన పార్టీ పోటీ చేసేది.. 2019 ఎన్నికల్లో డబ్బులు పంచి, కొన్ని సీట్లయినా గెలిచేది.!
నవ్విపోదురుగాక..
పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) రాజకీయం, సమాజంలో మార్పు కోసం. కరెన్సీ నోటుకి ఓటునీ, తమ జీవితాల్నీ జనం అమ్ముకునే రోజులు పోవాలని.! జనాల్ని పల్లకీ ఎక్కించాలని.!
Also Read: నువ్వు నాశనం చేసిన మట్టి.! నిన్ను ఇంకా బతికిస్తోంది.!
ప్చ్.! పూర్ ఫెలోస్.! పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) గురించి తెలిసీ, ఆయన డబ్బు కోసం రాజకీయాలు చేస్తున్నారంటూ, ‘పేటీఎం కూలీ’ కోసం కక్కుర్తి రాతలతో నవ్వులపాలవుతున్నారు.