Thellakaagitham Movie Review.. నేపథ్యంలో చిన్నపాటి మార్పు అంతే.! దాదాపుగా కథలన్నీ అంతే.! యూత్‌ఫుల్ లవ్ స్టోరీ.. అంటూ, ఈ మధ్య ‘చిన్న పిల్లల’ ప్రేమకథలు ఎక్కువైపోయాయ్ తెలుగు తెరపై.
ఓ సినిమా హిట్టయితే, అదే మూసలో అలాంటి సినిమాలు బోల్డన్ని ఎడా పెడా ప్రేక్షకుల ముందుకొచ్చేసి, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడం.. ఇదొక ప్రసహనం.
నిబ్బా నిబ్బీ లవ్ స్టోరీ.. అంటూ, ప్రమోషన్స్ చేసుకుంది ‘తెల్ల కాగితం’ సినిమా.! హీరోయిన్ నక్షత్ర, సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చేసిన సందడి, ఆమె గ్లామర్ చుట్టూనే ప్రమోషన్స్ గట్టిగా సాగాయి.
హీరో హర్ష్ రోషన్.. తెరపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాడు. కాకపోతే, అతని కోసం రాస్తున్న పాత్రలు, అతనికి వస్తున్న సినిమాలే.. పరమ రొటీన్‌గా మారిపోతున్నాయి.
Thellakaagitham Movie Review.. ఇంతకీ, ‘తెల్ల కాగితం’ కథా కమామిషు ఏంటి.?
అనగనగా ఓ అమ్మాయి.. అబ్బాయి.. చిన్న వయసులో తప్పటడుగు వేస్తారు. ఆ తర్వాత, వాళ్ళ జీవితాలెలా మారిపోయాయి.? ఇదే కథ.! ఆ తప్పేంటో, దాదాపుగా అందరికీ తెలుసు.
ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా హర్ష్ రోషన్ మంచి పెర్ఫామర్. కాకపోతే, స్పీడ్ ఎక్కువ. కంట్రోల్ చేసుకుంటాడు కూడా.! చాలా బాగా చేశాడు. అతనికి రాసిన పాత్రే ఇరిటేట్ చేస్తుంది.
ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు హర్ష్ రోషన్. ఫుల్ ఆఫ్ ఎనర్జీ.. అంతే కాదు, ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆకట్టుకుంటాడు.
హీరోయిన్ నక్షత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి సినిమానే అయినా, అనుభవం వున్న నటిలా కనిపించింది. చాలా బాగా చేసింది.
అజయ్, శరణ్య.. తదితరులు మామూలే.! వీళ్ళ పాత్రలూ మమ అనిపిస్తాయంతే. ఫ్రెండ్స్ గ్యాంగ్ హడావిడి ఫర్లేదంతే.
సినిమా మొదలయ్యాక, కాస్సేపటికి క్యూట్ లవ్ స్టోరీ.. అనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి ‘నస’ షురూ అయిపోతుంది. ఎప్పుడు సినిమా అయిపోతుందా.? అని ప్రేక్షకుడు, ఎదురు చూడాల్సిందే.
కథలో కొత్తదనం లేకపోయినా, కథనంలో కొత్తదనం చూపించే అవకాశం వుంది. ప్చ్, దర్శకుడు ఆ దిశగా కూడా పెద్దగా వర్క్ చేసినట్లు అనిపించదు.
లీడ్ పెయిర్ పెర్ఫామెన్స్ ఒక్కటీ, సినిమాకి కాస్తంత ఊరట. రెండు పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. కొన్ని డైలాగ్స్ యూత్‌ని ఆకట్టుకుంటాయి.
చివర్లో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం దర్శకుడు చేశాడుగానీ, దాన్ని అభినందించేంత ఓపిక సినిమా చూసిన ప్రేక్షకుడికి కలగదు. అప్పిటికే సహన పరీక్షలో ప్రేక్సకుడు ఓడిపోతాడు మరి.
యూత్ లవ్ స్టోరీస్.. వస్తూనే వుంటాయ్.! కొన్ని మాత్రమే మనసులకి హత్తుకుంటాయ్. ఈ ‘తెల్ల కాగితం’ అలా అలా గాలికెగిరిపోతుందంతే, అస్సలు గుర్తుపెట్టుకునేది కాదు.
ఫైనల్ టచ్: ఏమో, గుర్రం ఎగరావచ్చు.! యూత్‌కి కంటెంట్ కనెక్ట్ అయిపోతే మాత్రం, అన్ని మైనస్సులూ ప్లస్సులుగా మారిపోతాయ్.! కానీ, దానికి చాలా ‘లక్’ తోడవ్వాలి మరి.!
