Samantha Ruth Prabhu.. మయోసైటిస్.. ఈ వ్యాధి పేరుకి అంత పాపులారిటీ రావడానికి కారణం సినీ నటి సమంత.! ఔను మరి, సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అంత పాపులర్ అవుతుంటాయ్.!
కొన్నాళ్ళ క్రితం సమంత మయోసైటిస్ బారిన పడింది. ఇంకా ఆమె పూర్తిగా కోలుకోలేదు. అసలు మయోసైటిస్ అంటే ఏంటి.? అని చాలామంది రీసెర్చ్ చేసేశారు కూడా.!
‘యశోద’ సినిమా సమయంలో సమంత, ఈ మయోసైటిస్ గురించి వెల్లడించింది. డబ్బింగ్ కూడా వైద్య చికిత్స పొందుతూనే చెప్పింది.. అదీ చేతికి ‘ఐవీ’ వుండగానే.!
Samantha Ruth Prabhu.. శాకుంతలం.. చేతి మాల.!
తన తాజా చిత్రం ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి సమంత ‘శక్తినంతా కూడదీసుకుని’ వచ్చింది. జనాన్ని చూస్తూనే చాలా ఎమోషనల్ అయ్యింది కూడా.
సమంత చేతికి ఓ ‘దండ’ వుంది. సాధారణ పూసల దండ కాదు. అయ్యప్ప మాల, శివ మాల.. ఇలా మాలధారణ సమయంలో ధరిస్తారే, అలాంటి దండ అది.! పూసలు గచ్చబడిన దండ.
సెలబ్రిటీలకు సంబంధించి ప్రతి చిన్న విషయమూ వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు సమంత చేతికి వున్న ‘దండ’ కూడా అలాగే వైరల్ అవుతోంది.
అసలేంటీ దండ లేదా మాల..
మానసిక ప్రశాంతత కోసమో.. భక్తి భావంతోనో.. సమంత చేత్తో ఆ దండ పట్టుకుని వచ్చి వుండొచ్చు. అవసరమా.? అదంటే, ఏమో.. అవసరమేనేమో.!
Also Read: AMIGOS: కళ్యాణ్‌రామ్.. ముగ్గురు మొనగాళ్ళు.!
స్ట్రెస్ బాల్ పట్టుకుంటే బావోదు.. అందుకే, ఇలా సమంత.. ఆ చేతి దండతో వచ్చిందన్నది కొందరి వాదన. ఎవరి గోల ఎలా వున్నా, సమంతను అభినందించి తీరాలి.. సినిమా పట్ల ఆమె డెడికేషన్.. ప్యాషన్‌కి.
గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ‘శాకుంతలం’ సినిమాని విడుదల చేస్తున్నారు.