360 Degrees Tegulu.. ఔను.! అది మూడు వందల అరవై డిగ్రీల తెగులు.! అంటే, వైఫైలా ఆ తెగులు వ్యాపించేసిందన్నమాట.!
నిజానికి, అదో కుల జాడ్యం.! పేరుకే అదో వెబ్‌సైట్.. అందులో కనిపించేదంతా చెత్తే.! పైగా, అది పసుపు చెత్త.! పచ్చ పార్టీ కనుసన్నల్లో నడుస్తుంటుందది.
తప్పేం లేదేమో.. ఈ రోజుల్లో, మీడియా అనేది రాజకీయాలకతీతంగా వ్యవహరించడం కష్టం. కానీ, ఒకరి పల్లకీ మోస్తూ, ఇంకొకరి మీద విషం చిమ్మడమేంటి.?
360 Degrees Tegulu.. అమెరికాలో 360 డిగ్రీల తెగులు.!
కొన్నాళ్ళ క్రితం అమెరికాలో ఓ ‘పచ్చ’ కార్యక్రమం జరిగింది. ‘తానా’ అంటే, ‘తందానా’ అన్నట్టు సాగిన ఆ కార్యక్రమంలో తిండి కోసం కొట్టుకున్నారు పచ్చ తమ్ముళ్ళు.
ఆ గొడవ చాలా ఇంపుగా కనిపించింది ఈ మూడొందల అరవై డిగ్రీల తెగులుకి. తప్పదు.. తేడా వస్తే, పచ్చ బిచ్చం.. ఈ 360 డిగ్రీల తెగులలు బొచ్చెలో పడదు మరి.!

తాజాగా, అదే అమెరికాలో ఇంకో కార్యక్రమం జరిగింది. ఇక్కడేమో, రెడ్ టవల్‌తో ఎన్నారైలు సందడి చేశారు. పవన్ కళ్యాణ్ పాటలకి ఉత్సాహంగా డాన్సులు చేశారు.
అంతే, 360 డిగ్రీల తెగులుకి ఒళ్ళు మండిపోయింది. ఇదేం ‘ప్రొగ్రెసివ్’ (Progressive) అంటూ గుస్సా అయ్యింది.!
పచ్చ తెగులు కారణంగానే, ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాకి దారుణమైన రివ్యూ రాసి, చెత్త రేటింగు వేసేశారు. కానీ, ఏం జరిగింది.?
నవరంధ్రాల్లో రక్తస్రావం.!
రికార్డు స్థాయి వసూళ్ళను కొల్లగొట్టింది ‘వాల్తేరు వీరయ్య’.! రెండున్నర రేటింగుతోనే, అమెరికాలో రెండున్నర మిలియన్ డాలర్లు ఆర్జించింది ‘వాల్తేరు వీరయ్య’.!
Also Read: ప్రభాస్ ‘సలార్’ వాయిదా.! ఆ ఒత్తిడిని తట్టుకోలేకనే.!
సినిమా అయినా, రాజకీయం అయినా.. అంతా పచ్చ కళ్ళతోనే చూడటం, ఈ 360 డిగ్రీస్ తెగులు ప్రత్యేకత.!
ఇంతకీ, రెడ్ టవల్ ఎందుకో తెలుసు కదా.? అది జనసేన పార్టీని (Jana Sena Party) ప్రతిబింబిస్తుంది. ఆ ఎర్ర తుండుని చూసేసరికి, నవ రంధ్రాల్లోంచీ.. రక్తస్రావం జరిగినట్లుంది 360 డిగ్రీల తెగులుకి.!