Blue Media Mafia Reddy.. అదో దిక్కుమాలిన వెబ్ సైట్.! ఆడో నీలి మాఫియా రెడ్డి.! ఆడికి ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందట.!
కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చిందా.? లేదంటే, తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం రిపోర్ట్ ఇచ్చిందా.? లేదంటే, నెల నెలా పెంట వేసి మేపుతోన్న ఏపీలోని అధికార పార్టీ నుంచి ఆ రిపోర్ట్ తెప్పించుకున్నాడా.?
ఇవేవీ కాదు, ఏపీ ఇంటెలిజెన్స్ విభాగమే ఆ రిపోర్ట్ సమర్పించుకుందా.?
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు ఓడిపోతారనీ, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోతారనీ.. ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో వున్నాయనీ పిచ్చి రాతలు రాశాడు ఆ నీలి మాఫియా రెడ్డి తన వెబ్ సైట్‌లో.!
Blue Media Mafia Reddy.. ఇది వైసీపీ మార్కు బ్లూ జర్నలిజం..
ఎన్నికల వేళ ఓటర్లను ఏమార్చడానికి ఇలాంటి ప్రయత్నాలు చాలానే జరుగుతుంటాయ్.. అదీ వైసీపీ నుంచి. అందులో ఇదీ ఓ భాగమే.
ప్రభుత్వ ప్రకటనల పేరుతో అడ్డగోలుగా ప్రజాధనాన్ని మేసేసిన నీలి మాఫియా రెడ్డికి ఈ దిక్కుమాలిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందెవరో తేలాలి.!
ఏపీ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇంటెలిజెన్స్ ద్వారా సర్వేలు చేయించి, ఈ గొట్టంగాడికి ఆ రిపోర్ట్ సమర్పించిందని అనగలమా.? ఆ ఛాన్సే వుండదు.
అక్కడ, ఐపీఎస్ స్థాయి అధికారుల మీదనే ‘బదిలీ వేటు’ పడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఎన్నికలకు విధులకు దూరంగా ఇప్పటికే పలువురు అధికారుల్ని వుంచారు.
ఏ ఇంటెలిజెన్స్ ఆ రిస్క్ తీసుకుంటుంది.?
అలాంటప్పుడు, ఏ అధికారి అయినా రిస్క్ తీసుకుని, ఇంటెలిజెన్స్ విభాగం నుంచి సర్వేలు చేసి, మీడియాకి లేదా రాజకీయ పార్టీలకు లీక్ చేసే పరిస్థితే వుండదు కదా.?
మీడియా అంటే, ‘ఫోర్త్ ఎస్టేట్’ అని చెబుతుంటాం.. మన ప్రజాస్వామ్యంలో.! కానీ, మీడియాని ఇదిగో ఇలాంటి నీలి మాఫియాగాళ్ళు.. అత్యంత పతనావస్థకి నెట్టేశారు.
వ్యభిచారం కంటే హీనంగా కొందరు వ్యక్తులు మీడియా సంస్థల్ని నడుపుతున్న వైనం.. అత్యంత హేయం.!
ఇదే దిక్కుమాలిన వెబ్‌సైట్ ఆస్కార్ పురస్కారాల్ని గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి రెండున్నర రేటింగ్ ఇచ్చింది. అడ్రస్ గల్లంతైపోయిన ‘యాత్ర-2’ సినిమాకి మూడున్నర రేటింగ్ ఇచ్చుకుంది.
పాత్రికేయ వ్యభిచారం.. అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమైనా కావాలా.?
చివరగా.. ఎవడన్నా బొచ్చెలో బిచ్చం పడేస్తే.. కట్టుకున్న భార్య గురించీ, కన్న తల్లి గురించీ.. కడుపున పుట్టిన కూతురి గురించి కూడా గాసిప్స్ పోగేసే ‘నీలి’ మీడియా.. సమాజానికి అత్యంత హానికరం.!