Mouni Roy Book Glamour.. తెగ చదివేస్తోంది కదూ.! చదవడమా.? ఇంకేమన్నానా.? ఫొటో కోసం పోజులిచ్చిందంతే.!
కాదేదీ కవితకనర్హం.. అన్నాడో మహా కవి.! అలా, కాదేదీ ‘ఫొటో షూట్’కి అనర్హం.. అని అనుకోవాలంతే.!
తెలుసు కదా, ఫొటోలో వున్నదెవరో.! ఇంకెవరు, బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్. ‘నాగిని’ అనే హిందీ టెలివిజన్ సీరియల్‌తో పాపులర్ అయ్యింది మౌనీ రాయ్.
ఆ తర్వాత, వరుసగా సినిమా ఆఫర్లు వచ్చి పడ్డాయ్. అంతే, రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది. స్పెషల్ సాంగ్స్‌లోనూ అదరగొట్టేస్తోంది మౌనీ రాయ్.
Mouni Roy Book Glamour.. ఔను, వాళ్ళిద్దరి మధ్యా స్పెషల్ కెమిస్ట్రీ..
సినిమాల సంగతెలా వున్నా, సోషల్ మీడియాలో మౌనీ రాయ్ ఫొటోలు.. ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతుంటాయ్. ఆ స్థాయిలో గ్లామర్ ఒలకబోస్తుంటుంది మౌనీ రాయ్.
మౌనీ రాయ్‌కి.. మరో హాట్ బ్యూటీ దిశా పటానీ మంచి స్నేహితురాలు. వీరిద్దరి ఫొటోలూ.. వేరే లెవల్ సందడి చేస్తుంటాయ్ సోషల్ మీడియాలో.

మౌనీ రాయ్, దిశా పటానీ మధ్యన ఏదో కెమిస్ట్రీ నడుస్తోందన్న గాసిప్స్ సంగతి సరే సరి.! ఆ కెమిస్ట్రీ సంగతేంటో, ఆ ఇద్దరికే తెలియాలి.
సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం తెలుగులోనూ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందిట మౌనీ రాయ్. అదీ, ఓ స్టార్ హీరో సినిమా కోసం.!
నెగెటివ్ షేడ్స్.. బాగా ఇష్టమట..
ఇక, మౌనీ రాయ్ పుస్తకాలతో ఒలకబోస్తున్న గ్లామర్ చూసి.. అందమైన ‘పుస్తకాల పురుగు’ అంటూ నెటిజనం కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో.
Also Read: ‘ముద్దు సీన్’ ఎలా తొలగిస్తారు.? శ్రేయ గుస్సా.!
అన్నట్టు, సినిమాల్లో హీరోయిన్ రోల్స్ కంటే, నెగెటివ్ షేడ్స్ వున్న రోల్స్ అంటేనే, అందాల భామ మౌనీ రాయ్‌కి బాగా ఇష్టమట.

డాన్స్ అంటే చాలా చాలా ఇష్టమనీ, అందుకే స్పెషల్ సాంగ్స్ చేయడానికి బాగా ఇష్టపడుతుంటానని మౌనీ రాయ్ చెబుతుంటుంది.
ఏదో ఫొటో సెషన్ కోసమే ఇలా పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదనీ, తాను నిజంగానే పుస్తకాల పురుగునని ఓ ఇంటర్వ్యూలో పుస్తక పఠనం మీద తన ఆసక్తిని బయటపెట్టింది మౌనీ రాయ్.