Sara Arjun Madhubala Biopic.. మధుబాల ఎవరు.? బాలీవుడ్ నటి.! నటిగా తిరుగులేని పేరు ప్రఖ్యాతులు ఆమె సొంతం. 36 ఏళ్ళ వయసులోనే, హఠాన్మరణం.!
బాలీవుడ్ నటి మధుబాల గురించి చెప్పుకోవాలంటే, చాలా చాలా పెద్ద కథ.! నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, గ్లామర్ ప్రపంచంలో మహరాణిగా వెలిగిందామె.!
‘మొఘల్ ఎ అజామ్’లో మధుబాల నటన గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అందం, అభినయం.. అన్నీ కలిస్తే, మధుబాల.
భారతీయ సినీ పరిశ్రమలోనే మధుబాలకు సాటి రాగల నటి ఇంకొకరు లేరు.. అని, బాలీవుడ్ మీడియా కొనియాడుతుంటుంది ఇప్పటికీ.!
Sara Arjun Madhubala Biopic.. అసలు పేరు ముంతాజ్ జెహాన్ బేగమ్..
అసలు పేరు ముంతాజ్ జెహన్ బేగమ్ దెహ్లావీ. బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్‌తో ప్రేమాయణం నడిపారు మధుబాల. కానీ, అది విఫల ప్రేమగాధగానే మిగిలిపోయింది.
గాయకుడు కిషోర్ కుమార్‌ని పెళ్ళాడారు మధుబాల. కానీ, చిన్న వయసులోనే ఆమె తుది శ్వాస విడిచారు. కారణం, ఆమెకున్న అనారోగ్య సమస్య. వేరే కారణాలు కూడా చెబుతుంటుంటారు. అది వేరే చర్చ.

ఇప్పుడు ఆ మధుబాల గురించిన చర్చ ఎందుకు.? అంటే, బాలీవుడ్ నటి సారా అర్జున్ ప్రధాన పాత్రలో మధుబాల బయోపిక్ తెరకెక్కబోతోంది.
సారా అర్జున్ అంటే, ‘దురంధర్’ బ్యూటీ. బాల నటిగా సౌత్‌లోనూ ఒకటీ అరా సినిమాల్లో నటించింది సారా అర్జున్. మంచి నటి. ఆ విషయం ‘దురంధర్’తో ప్రూవ్ అయ్యింది.
నిజానికి, మధుబాల బయోపిక్ అంటే, సారా అర్జున్‌కి వయసుకు మించిన బాధ్యత.. అనే చెప్పాలి. ఏం, సావిత్రి బయోపిక్‌లో కీర్తి సురేష్ నటించలేదా.? అంటే, అంతే కదా మరి.!
Also Read: చెక్కుతారు.. దిద్దుతారు.! అందుకే, అందంగా కనబడతారు.!
‘దురంధర్’ సినిమాలో సారా అర్జున్ నటనా ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమెకు దేశవ్యాప్తంగా నటిగా తిరుగులేని గుర్తింపుని తీసుకొచ్చింది ‘దురంధర్’.!
త్వరలోనే ‘మధుబాల’ బయోపిక్ సెట్స్ మీదకు రానుంది.!
