Table of Contents
Dacoit Review.. కొన్నేళ్ళ క్రితం ఓ తెలుగు సినిమా వచ్చింది. హీరోయిన్‌ని హీరో ప్రేమిస్తాడు. కానీ, హీరోయిన్‌కి వేరే వ్యక్తితో పెళ్ళయిపోతుంది. ప్రేమికుడేమో, గుండెకాయ్‌ని త్యాగం చేస్తాడు.
ఇక్కడ, ఈ ‘డెకాయిట్’ సినిమాలో కూడా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్ళయిపోతుంది. హీరో, తన గుండెకాయ్‌ని త్యాగం చేసేస్తాడు.
కాకపోతే, ముందు చెప్పుకున్న సినిమా ఎమోషనల్ డ్రామా.. ఇక్కడ ఇప్పుడు చెప్పుకుంటున్నదేమో, ఒకింత యాక్షన్ మిక్స్ చేసిన ‘థ్రిల్లర్’.!
మాస్.. ఊర మాస్ హీరోగా అడివి శేష్‌ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్.
దర్శక నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మేనకోడలు జేయన్ మేరీ ఖాన్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తరాగణం.
కథేంటో ముందే చూచాయిగా చెప్పేసుకున్నాం కదా.! కాస్త డిటెయిల్డ్‌గా చెప్పుకుందామిప్పుడు ప్రియురాలు వెన్నుపోటు పొడవడంతో, నేరస్తుడిగా జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు మన హీరో.
Dacoit Review.. ప్రియురాలికి గుణపాఠం చెప్పడానికి..
జైల్లో పరిచయమైన ఓ స్నేహితుడి ద్వారా, జైలు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ చేసిన హీరో, తన ప్లాన్ ప్రకారం తప్పించుకుంటాడు.
తప్పించుకున్నది ప్రియురాలికి గుణపాఠం చెప్పడానికి. అయితే, అదేమో కరోనా సీజన్. హీరోయిన్‌ని హీరో చూస్తాడు. ఓ దొంగతనంలో హీరోయిన్‌ని ఇరికించెయ్యాలనుకుంటాడు హీరో.
కట్ చేస్తే, అక్కడే కథ మలుపు తిరుగుతుంది. హీరోయిన్ మీద తనకున్నది ప్రేమ.. అని హీరో తెలుసుకుంటాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్. అదేంటన్నది, పైనే చెప్పేసుకున్నాం కదా.. అదే గుండెకాయ్ ట్విస్ట్.
ఏమనుకుని కథని రాసుకున్నారో, ఏమనుకుని కథని తెరకెక్కించారోగానీ, గుండె సమస్యతో బాధపడుతున్న హీరోయిన్.. ఎడా పెడా ఛేజింగులు చేసేస్తుంటుంది.
ఎలివేషన్స్.. ఎలివేషన్స్..
సినిమా అంతా హీరోకి ఎలివేషన్స్ ఇవ్వడంతోనే సరిపోయింది. అడివి శేష్ మంచి నటుడు. అతని సినిమాలు భిన్నంగా వుంటాయ్. ఇలాంటి నాసిరకం కథని మనం అస్సలు ఆశించం.
మృణాల్ ఠాకూర్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కొత్తమ్మాయ్ జేయన్ మేరీ ఖాన్, పెద్దగా చేయడానికేం లేదు. విగ్రహం పుష్టి.. అంతే.
ఇక, అనురాగ్ కశ్యప్ గురించి చెప్పుకోవాలంటే, చిత్ర విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ పెడుతుంటాడు. స్వామి మాల ఎందుకు.? అంటే, క్యారెక్టర్ వెయిట్ పెంచడానికేమో.. అనిపిస్తుందంతే.
సినిమాకి టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ బాగానే వర్క్ చేశాయి. అయితే, కథలో అలానే కథనంలో స్టఫ్ వుండి వుంటే, టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ ఇంకా బాగా వర్క్ చేసి వుండేవి.
చాలా కత్తిరించేయాల్సింది..
ఎడిటింగ్ కోణంలో చూస్తే, చాలా సీన్స్‌ని లేపేయొచ్చు, నిడివిని బాగా తగ్గించేయొచ్చు కూడా.
గుండెకాయ ట్విస్ట్ రివీల్ అయిపోయాక, ప్రేక్షకులు సినిమాలో ప్రతి సీన్‌ని ట్రోల్ చేసేస్తారని దర్శక నిర్మాతలు ఊహించకపోవడమే ఆశ్చర్యం.
సినిమా ప్రమోషన్లు గట్టిగానే చేశారు.. దాంతో, బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. తమ సినిమా హిట్టేనని మేకర్స్ చెప్పుకున్నారు. కానీ, థియేటర్ల వైపు జనం పెద్దగా చూడలేదు.
ఇప్పుడు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఫాస్ట్ ఫార్వార్డ్ కొట్టేస్తూ సినిమా చూస్తున్నారు ఓటీటీలో. ట్రోలింగ్ మాత్రం బాగా జరుగుతోంది గుండెకాయ్ ట్విస్టుకి.!
