Home » పొత్తు పొడవనుందా.? వైఎస్ జగన్ చేతులు కలిపేదెవరితో.?

పొత్తు పొడవనుందా.? వైఎస్ జగన్ చేతులు కలిపేదెవరితో.?

by hellomudra
0 comments
Ys Jagan Mohan Reddy

Ys Jagan Alliance Politics.. సింగిల్ సింహం కథలకు కాలం చెల్లింది. రాజకీయాల్లో వ్యూహాలు తప్పనిసరి.. ఏ రాజకీయ పార్టీకైనా ఇది వర్తిస్తుంది.

నిజానికి, రాజకీయాల్లో ‘పొత్తులు’ అనేవి సర్వసాధారణం. భావసారూప్యత కలిగిన పార్టీలు ఒక్కతాటిపైకొచ్చి, కూటమిగా కలిసి పోటీ చేయడం ఎప్పటినుంచో జరుగుతున్నదే.

కాలక్రమంలో భావసారూప్యతకి అర్థం మారిపోయింది. అప్పటిదాకా తిట్టుకుని, రాత్రికి రాత్రి ‘దోస్తీ’ షురూ చేయడం గత కొంతకాలంగా నడుస్తున్న పొలిటికల్ ట్రెండ్.

తనను తిట్టినవారిని పార్టీలోకి ప్రత్యేకంగా ఆహ్వానించి, గౌరవిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

టీడీపీ – జన సేన మధ్య రాజకీయ వైరం, ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి పని చేయడం.. తెలిసిన విషయాలే. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి.

Ys Jagan Alliance Politics.. ఏమో గుర్రం ఎగరావచ్చు..

మరి, 2029 ఎన్నికల నాటికి పొలిటికల్ ఈక్వేషన్ ఎలా మారబోతోంది.? సింగిల్ సింహం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, ‘పొత్తు రాజకీయం’ షురూ చేశారా.?

గత కొద్ది రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పొత్తు ప్రస్తావనలు నడుస్తున్నాయి. 2029 ఎన్నికల్లో ‘స్నేహాలు’ వుంటాయనే సంకేతాలు అధినేత స్వయంగా పార్టీ ముఖ్య నేతలకు పంపారట.

బీజేపీతో కలుస్తారా.? కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతారా.? పవన్ కళ్యాణ్‌ని ప్రసన్నం చేసుకుంటారా.? ఈ మూడే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందున్న ఆప్షన్స్.

‘బీజేపీకి వైఎస్ జగన్ శాశ్వత మిత్రుడు’ అంటూ, ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో చెప్పించింది ఇంకెవరో కాదు, స్వయంగా వైసీపీ అధినేతేనంటూ ఓ ప్రచారం జరుగుతోంది.

ఇందుకోసం వైసీపీ నుంచి పెద్దమొత్తంలోనే ‘అందుకున్నారు’ నాగేశ్వర్.. అనే చర్చ మీడియా వర్గాల్లో జరుగుతోంది. ఈ ప్రకటనతో, బీజేపీ కేంద్ర నాయకత్వంలో కొంత సానుకూలత జగన్ పట్ల కలిగిందట.

ఎవరు ఎవరితో చేతులు కలుపుతారో మరి.?

మరి, టీడీపీ అలానే జన సేన పార్టీతో బీజేపీ దోస్తీ ఏమవుతుంది.? అంటే, ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ ఎలాగైనా మారొచ్చు.

2014 ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ కలిసి పోటీ చేశాయి.. జన సేన, ఈ రెండు పార్టీల కూటమికి మద్దతిచ్చినా, ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

ఆ కూటమి, 2019 ఎన్నికల దాకా కొనసాగలేదు.. మధ్యలోనే ముక్కలైపోయింది. ఇంకోసారి అదే పరిస్థితి రాబోతోందనీ, కూటమి ముక్కలవడానికి ఎంతో సమయం పట్టదని వైఎస్ జగన్ బలంగా నమ్ముతున్నారు.

నిజమే, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారతాయో చెప్పలేం. కాంగ్రెస్ వేవ్.. అనే సంకేతాలు అందితే, రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీతో జగన్ చేతులు కలిపేసే అవకాశం వుంది.

లేదూ, బీజేపీతో కలవాల్సి వచ్చినా వైఎస్ జగన్ ఈసారి ఆ ఛాన్స్‌ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వదులుకోకపోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం.. 2029 ఎన్నికలు, 2024 ఎన్నికలతో పోల్చితే మరింత రసవత్తరంగా మారనున్నాయి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group