Jagan Lokesh Assembly.. బస్తీ మే సవాల్.. అంటున్నారు మంత్రి నారా లోకేష్.! అసెంబ్లీ సమావేశాలకు హృదయ పూర్వక ఆహ్వానం కూడా పలుకుతున్నారు.!
ఎవరికో తెలుసు కదా.? ఇంకెవరికి.. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే నారా లోకేష్ పంపిస్తున్నారు ఆహ్వానం.!
అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాల్సిందిగా నారా లోకేష్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. సవాల్ విసురుతున్నారు.! ఛాలెంజ్ కూడా చేస్తున్నారు నారా లోకేష్.!
ప్చ్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి రెస్పాన్స్ రావడంలేదు. అసెంబ్లీ సమావేశాలంటేనే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గిట్టడంలేదు.!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2019లో 151 అసెంబ్లీ సీట్లు వచ్చాయి.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠమెక్కారు.! అంతకు ముందు వైఎస్ జగన్, ప్రతిపక్ష నేతగా పని చేశారు.
అప్పుడూ.. ఇప్పుడూ.. చంద్రబాబే ముఖ్యమంత్రిగా వున్నారు వైఎస్ జగన్, అధికారంలో లేనప్పుడు.!
Jagan Lokesh Assembly.. మొహం చాటేస్తున్న పులివెందుల ఎమ్మెల్యే..
అప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జగన్, ఇప్పుడెందుకు అసెంబ్లీ సమావేశాలంటే మొహం చాటేస్తున్నట్లు.? ఇదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు.!
ఒకవేళ తాను అసెంబ్లీ సమావేశాలకు వెళితే, టీడీపీ శాసన సభ్యులు అలాగే జన సేన శాసన సభ్యులు.. పనిలో పనిగా బీజేపీ శాసన సభ్యులు తనను అవమానిస్తారన్న భయం జగన్‌కి వుంది.
ఆ సంగతీ పక్కన పెడితే, నారా లోకేష్ ముందర తాను తల దించుకోవాల్సి వస్తుందని వైఎస్ జగన్ భయపడుతున్నారా.? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
వాస్తవానికి, అసెంబ్లీ అంటే ప్రజలెన్నుకున్న శాసన సభ్యులు కొలువుదీరే ఓ గొప్ప సభ.! ఇక్కడ చట్టాలు చేయడం జరుగుతుంది. సభ్యులందరికీ సమాన హక్కులుంటాయి.
పార్టీల వారీగా ఆయా పార్టీలు గెలిచిన శాసన సభ నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా మాట్లాడేందుకు సమయం కేటాయించబడుతుంది. ఇదే నచ్చడం లేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.
తమకు పదకొండు సీట్లే వున్నా సరే, ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే అవకాశం తనకూ ఇవ్వాలన్నది జగన్ డిమాండ్. అదెలా కుదురుతుందన్నది కూటమి ప్రశ్న.
ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పదే పదే ర్యాగింగ్ చేస్తున్నారు నారా లోకేష్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.! రమ్మని పిలుస్తున్నారు.. సవాల్ విసురుతున్నారు కూడా.
కారణం ఏదైతేనేం, నారా లోకేష్‌కి వైఎస్ జగన్ భయపడుతున్నారన్న సంకేతాలు వెళ్ళిపోతున్నాయి ప్రజల్లోకి.! అవసరమా ఇదంతా.?
నేరుగా అసెంబ్లీకి వెళ్ళి, తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు, తాను చెప్పదలచుకున్నది చెప్పేసి, హుందాగా అసెంబ్లీ నుంచి వైఎస్ జగన్ వచ్చేయొచ్చు కదా.?
