Table of Contents
EPIC First Semester Review.. శోభనం – తొలి రాత్రి.. పేరేదైతేనేం, అదొక మధురమైన సందర్భం భార్యాభర్తలకి.! అలాంటి సన్నివేశాన్ని కళాత్మకంగా తీయగలిగితే, అదొక అద్భుతమవుతుంది.!
కానీ, కామంతో నిండిపోయిన కళ్ళతో ‘శోభనం రాత్రి’ సన్నివేశాన్ని చిత్రీకరిస్తే, అదెంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!
ఇప్పడిదంతా ఎందుకో, ఈ సినిమా రివ్యూ చివర్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే, సినిమా కథేంటి.. కమామిషు ఏంటి.? నటీనటులు ఎలా చేశారు.. సాంకేతిక నిపుణుల పని తీరు ఏంటి.? నిర్మాణపు విలువలేంటి.? వీటిపై డిస్కస్ చేద్దాం.
EPIC First Semester Review.. కథ కాదు కామంతో కసెక్కిపోయే వ్యధ.!
అనగనగా ఓ కుర్రాడు.! సినిమా డైరెక్టర్ అయిపోదామనుకుంటాడు. కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆ కుర్రాడికి, ఓ కుర్రది ‘సెట్టవుతుంది’.!
సెట్టవుతుందని ఎందుకన్నామంటే, సెట్టయ్యింది మరి.! తొలి చూపులోనే, ఇద్దరూ కామించేసుకున్నారు కదా.. అందుకే, ‘సెట్టయ్యింది’ అనాలి.
ప్రేమ వద్దు, ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే కావాలనుకోవడం.. ‘వ్యక్తిత్వం’.! సెల్ఫ్ రెస్పెక్ట్.. మట్టీ మషానం.. అన్నమాట.!
ఇద్దరి మధ్యా అన్నీ జరిగిపోతాయ్.! అన్నీ అంటే.. అన్నీనూ. కథలో ఏదో కాన్ఫ్లిక్ట్ తగలడాలి కదా.. అదీ తగలడింది. ఆ తర్వాత ఏమయ్యిందన్నది మిగతా కథ.!
నటన ముసుగులో ఎవరెలా చేశారంటే..
మిగతా విషయాల్ని పక్కన పెట్టి, నటీ నటుల నటన గురించే మాట్లాడుకోవాల్సి వస్తే, ఇటు ఆనంద్ దేవరకొండ మాత్రమే కాదు అటు వైష్ణవి చైతన్య కూడా తమ తమ పాత్రల్లో జీవించేశారు.
ఇందులో నటించడానికేముంది.? జీవించేయమని దర్శకుడు చెబితే, అలా జీవించేశారంతే. సినిమాని దర్శకుడు కళాత్మకంగా తెరకెక్కించి వుంటే, అద్భుతంగా నటించారని పేర్కొనాల్సి వచ్చేది.
ఆనంద్ దేవరకొండ అమాయకత్వం.. వైష్ణవి చైతన్య పెంకితనం, మూర్ఖత్వం, విచ్చలవిడితనం.. ఇదీ, ఈ ఇద్దరి నటనా ప్రతిభ. ఇందులో జీవించేశారంతే.
‘పీరియడ్స్’ గురించి డిస్కషన్ చెయ్యకూడదా.? అంటే, చెయ్యొచ్చు.. కానీ, దానికీ ఓ పద్ధతంటూ తగలడింది. చెప్పాల్సిన మంచి విషయాన్ని, అందరికీ అర్థమయ్యేలా చెబితే, అది ఓ లెక్క.
Also Read: చెక్కుతారు.. దిద్దుతారు.! అందుకే, అందంగా కనబడతారు.!
కానీ, ‘పీరియడ్స్’ గురించిన టాపిక్ తెర మీద వచ్చిన ప్రతిసారీ, థియేటర్లలో ఆడా.. మగా.. తల దించుకోవాల్సి వచ్చింది. అంత ఛండాలంగా ఆ సీన్స్‌ని దర్శకుడు డిజైన్ చేశాడు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య.. ఈ సీన్స్, వాటిల్లో డైలాగ్స్ విషయమై కాస్తంతైనా ‘అబ్జెక్షన్’ పెట్టి వుండాలి. పెట్టలేదు. పైగా, విచ్చలవిడిగా ఎంజాయ్ చేసినట్లున్నారు.. ఆ సీన్స్‌ని.
కథ ఎట్నుంచి ఎటు వెళుతుందో తెలియదు.. ఎక్కడ ముగుస్తుందో తెలియదు. మధ్యలో శివాజీ నటన బావుంటుంది. అతని పాత్ర ఆకట్టుకుంటుంది. వాసుకి పాత్ర కూడా.
కొన్ని సీన్స్ యువతకి కనెక్ట్ అవుతాయి. అంతలోనే, అత్యంత జుగుప్సాకరంగా మారిపోతుంది తర్వాతి సన్నివేశం. ఫస్టాఫ్, సెకెండాఫ్.. అంతా ప్యూర్ నాన్సెన్స్.
‘ఇదేమీ వల్గర్ సినిమా కాదు’ అంటూ రిలీజ్‌కి ముందు కథలు చెప్పారుగానీ, వల్గర్ సినిమానే.!
Also Read: సెల్ఫీ ప్రేమ.! అందాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుందా.?
కుటుంబ సభ్యులతో కూడా చూడొచ్చని ప్రమోషన్స్‌లో సెలవిచ్చారు.. కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్తే, వాళ్ల చేతిలో చెప్పు దెబ్బలు తప్పవ్ ఎవరికైనాసరే.
కక్కుర్తికీ, కళాత్మకతకీ చాలా తేడా వుంది. సినిమా అనేది ఓ కళ. కళాత్మకంగా సినిమాని తెరకెక్కిస్తే, ఆ సినిమాలోని ఏ సీన్ అయినా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
కళాత్మకత పక్కన పెట్టేసి, కక్కర్తితో సినిమా తెరకెక్కిస్తే, ఇదిగో ‘ఎపిక్’లా వుంటుంది. సినిమా ప్రమోషన్స్‌లో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అవి నమ్మి సినిమాకి వెళితే అంతే సంగతులు.
టెక్నికల్‌గా ఎలా తగలెట్టారంటే..
సాంకేతిక అంశాల విషయానికొస్తే, హేషమ్ మ్యూజిక్ బావుంది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. డైలాగ్స్‌లో వల్గారిటీ శృతి మించింది.
ఎడిటింగ్ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే, చాలా జుగుప్సాకరమైన సీన్స్‌కి నిర్మొహమాటంగా కత్తెర వేటేసి వుండాల్సింది.
నిర్మాణ విలువల గురించి చెప్పుకోవాలంటే, అస్సలు తగ్గలేదు.. గట్టిగానే ఖర్చు చేశారు. కానీ, ఇలాంటి దిక్కుమాలిన సినిమా తెరకెక్కించకుండా వుండాల్సింది. నిర్మాణ సంస్థకే చెడ్డపేరు ఇది.
Also Read: నాగవంశీకీ నవ్య స్వామికీ మధ్య ‘ఎఫైర్’.! ఈ ‘నెగెటివిటీ’ ఎవరి పని.?
మళ్ళీ మొదటికి వద్దాం.. శోభనానికీ, రేప్కీ చాలా తేడా వుంది. థియేటర్లలో ప్రేక్షకుడు అత్యాచారానికి గురవడం ఖాయం ‘పీరియడ్’ సీన్స్‌కీ.. బ్లడ్ స్టెయిన్స్.. అలానే లీడ్ పెయిర్ ఆన్ స్క్రీన్ కక్కుర్తి సన్నివేశాలకీ.
ఇలాంటి దిక్కుమాలిన సినిమాలకు రివ్యూలు రాయాల్సి రావడం నిజంగానే పెద్ద శాపం. ఇది ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ అట.! రెండో సెమిస్టర్ ఇంకెంత ఛండాలంగా తెరకెక్కిస్తారో ఏమో.!
