Home » ‘చుట్టమల్లే’ డీప్ ఫేక్: ఎన్టీయార్ సీరియస్ వార్నింగ్.!

‘చుట్టమల్లే’ డీప్ ఫేక్: ఎన్టీయార్ సీరియస్ వార్నింగ్.!

by Mudra369 Editorial Desk
0 comments
Devara Chuttamalle Jr NTR Janhvi Kapoor

Devara Chuttamalle Deepfake Video.. జూనియర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో చాన్నాళ్ళ క్రితం వచ్చింది ‘దేవర’ సినిమా.

ఆ ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ సాంగ్ అప్పట్లో ట్రెండింగ్.. బోల్డంత హంగామా చేసింది ‘చుట్టమల్లే’ సాంగ్.. యూ ట్యూబ్‌లోనూ, థియేటర్లలోనూ.

ఇప్పుడు, మళ్ళీ ఆ పాట సంచలనంగా మారింది. అయితే, ఈసారి అత్యంత అసభ్యకరమైన రీతిలో సంచలనంగా మారింది ‘చుట్టమల్లే’ సాంగ్.

ఎవరు చేశారో తెలియదుగానీ, ఓ ‘డీప్ ఫేక్ – ఏఐ’ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. వాట్సాప్ గ్రూపుల్లో కూడా చక్కర్లు కొట్టేస్తోంది.

ఏఐ సాంకేతికత సాయంతో, డీప్ ఫేక్ వీడియోను రూపొందించి వదిలారు. అందులో అత్యంత అసభ్యకరంగా జూనియర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ మధ్య సీన్స్ కనిపిస్తున్నాయి.

Devara Chuttamalle Deepfake Video.. జూనియర్ ఎన్టీయార్ తీవ్ర ఆగ్రహం..

ఈ విషయం జూనియర్ ఎన్టీయార్ దృష్టికి వెళ్ళింది. ‘మహిళను దేవతగా భావించి, పూజించి, గౌరవించే భారత దేశంలో ఇలాంటి దుశ్చర్య దారుణం..’ అంటూ జూనియర్ ఎన్టీయార్ వ్యాఖ్యానించాడు.

‘ఎవరూ ఇలాంటి వీడియోల్ని చూడొద్దు.. సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు’ అంటూ విజ్ఞప్తి చేశాడు జూనియర్ ఎన్టీయార్. ఎవరు వీడియోని తయారు చేశారో, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించాడాయన.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత దుర్వినియోగమవుతోందనీ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలానే కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి దారుణాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు.

Devara Chuttamalle Jr NTR Janhvi Kapoor
Devara Chuttamalle Jr NTR Janhvi Kapoor

ఈరోజు ఎవరో.. రేప్పొద్దున్న మీ ఇంట్లోని ఆడవాళ్ళ మీద కూడా ఇలాంటివే సృష్టిస్తారు.. అప్రమత్తంగా వుండండి.. ఈ తరహా కంటెంట్‌ని చూడొద్దు, షేర్ చేయొద్దు.. అంటూ జూనియర్ ఎన్టీయార్ సూచించాడు.

నిజానికి, చాలామంది హీరోయిన్ల విషయంలో ఈ తరహా వల్గర్ కంటెంట్ సోషల్ మీడియా వేదికగా గత కొన్నాళ్ళుగా సర్క్యులేట్ అవుతూనే వుంది.

రష్మిక మండన్న, మృణాల్ ఠాకూర్, రుక్మిణీ వసంత్.. చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా చాలా పెద్దదే. అదుపు చేయడానికి వీల్లేని స్థాయికి వెళ్ళిపోయింది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ వ్యవహారం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group