Home » మురిపెం.! అంతర్జాతీయ క్రికెట్‌లో ముచ్చటైన ‘తెలుగు’.!

మురిపెం.! అంతర్జాతీయ క్రికెట్‌లో ముచ్చటైన ‘తెలుగు’.!

by Mudra369 Editorial Desk
0 comments
Tilak Varma Nitish Kumar Reddy

Tilak Nitish Telugu Cricket.. ఇప్పుడంటే, తెలుగు కామెంటరీ కూడా చూస్తున్నాంగానీ.. క్రికెట్ కామెంటరీ అంటే, కేవలం ఇంగ్లీషు మాత్రమే ఒకప్పుడు.

ఆ తర్వాత హిందీ కామెంటరీ, తర్వాత్తర్వాత ప్రాంతీయ భాషల్లో కామెంటరీ కూడా అందుబాటులోకి వచ్చింది. తెలుగు క్రికెటర్లు, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు, రికార్డులు తిరగరాశారు కూడా.!

కానీ, మైదానంలో ఇద్దరు తెలుగు క్రికెటర్లు.. తెలుగులో మాట్లాడుకోవడం.. బహుశా ఇంతకు ముందెన్నడూ జరగలేదేమో.!

వీవీఎస్ లక్ష్మణ్ ఎక్కువగా ఇంగ్లీషులోనే మాట్లాడతాడు.. ఇంటర్వ్యూల్లో కూడా. వెంకటపతి రాజు, తెలుగులోనే మాట్లాడతాడుగానీ.. మైదానంలో, తెలుగు మాట్లాడేందుకు, సహచర తెలుగు క్రికెటర్ వుండేవాడు కాదు.

అజారుద్దీన్ తెలుగు నేలకు చెందిన క్రికెటర్ అయినా, అతనికి తెలుగు రాదు. ఎప్పుడూ అతను తెలుగుగులో మాట్లాడింది లేదు.

తాజాగా, ఇద్దరు యంగ్ క్రికెటర్లు.. మైదానంలో, వికెట్ల మధ్యన పరుగులు తీస్తూ, ముచ్చటగా తెలుగులో సంభాషించుకోవడం.. చర్చనీయాంశంగా మారింది.

ఒకరేమో తిలక్ వర్మ, ఇంకొకరేమో నితీష్ కుమార్ రెడ్డి. ఇద్దరూ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాని గెలిపించారు.

తృటిలో రనౌట్ జరిగేదే. కానీ, తెలివిగా తప్పించుకున్నారు. ఈ క్రమంలో నితీష్, తిలక్ మధ్య సంభాషణ తెలుగులో జరిగింది.

నువ్వు కాల్ ఇవ్వలేదు – తిలక్ వర్మ

నువ్వు వచ్చేసెయ్, నేను వచ్చేస్తా ఆరాం సే – నితీష్ కుమార్ రెడ్డి

రేయ్.. రెండు అని చెప్పురా పోనీ, నేను ముందొచ్చి వెయిట్ చేస్తా నీ కోసం – తిలక్

తెలుగులో సంభాషణ అదిరింది కదా.! ఇంకోపక్క, కామెంటరీ విభాగంలో నటి సయామీ ఖేర్ అలానే, మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఇంకోపక్క కామెంటేటర్ హర్షా బోగ్లే.. ముగ్గురూ చక్కగా తెలుగులో ఈ విషయమై స్పందించారు.

సయామీ ఖేర్ తెలుగు సినిమాల్లో నటించిందిగానీ, తెలుగమ్మాయ్ కాదు. ఆమెకు తెలుగు కొంచెం కొంచెమే వచ్చు. హర్షా భోగ్లేకి కాస్త తెలుగు వచ్చు.

దినేష్ కార్తీక్, తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆయనకి తెలుగు మూలాలున్నాయి. కొంచెం కొంచెం తెలుగు మాట్లాడతాడు దినేష్ కార్తీక్.

మొత్తమ్మీద, తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి.. ప్రపంచ క్రికెట్‌లో ‘తెలుగు సత్తా’ని చాటి చెప్పినట్లయ్యింది. దేశ భాషలందు తెలుగు లెస్స.. అని సగర్వంగా చెబుతుంటాం.

తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్.. అని ఎందరో ప్రముఖులు పొగిడారు. టీమిండియా క్రికెటర్ల కారణంగా, క్రికెట్ వేదికలపైనా, ‘తెలుగు భాష’ గురించిన చర్చ జరుగుతోంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group