‘ఆహ నా పెళ్ళంట’ సినిమా గుర్తుందా.? రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన సినిమా అది. అందులో, హీరో రాజేంద్రప్రసాద్ ఓ సన్నివేశంలో తన శరీరానికి న్యూస్ పేపర్‌ని (Sree Mukhi Hot Show) కట్టుకుని కనిపిస్తాడు. పిసినిగొట్టుతనాన్ని చాటుకునేందుకు హీరో చేసే ప్రయత్నమది. ఆ సినిమాలో ఆ సీన్ భలే కామెడీ పండించింది.
కానీ, ఇక్కడ మేటర్ కామెడీ కాదు, చాలా చాలా ట్రెండీ. కొంచెం కొత్తగా ఏది ట్రై చేసినా అది ట్రెండింగే మరి. ఈ మధ్యకాలంలో అందాల భామలు, శరీరానికి ‘పేపర్’ చుట్టేసుకుని, నయా గ్లామర్.. నయా ట్రెండ్.. అంటున్నారు. ఈ లిస్ట్‌లో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చేరిపోయారు.
ఇదెక్కడి పైత్యం.? అని కొందరు బుర్ర గోక్కోవచ్చుగాక. ఎవడి వెర్రి వాడికి ఆనందం.. అన్నట్టు ఎవరి ఫ్యాషన్ వారికి అందం కూడా.! అమ్మాయిలే కాదు, అబ్బాయిలూ ఈ మధ్య ఈ ఫ్యాషన్ ట్రెండ్‌ని వంటబట్టించుకుంటున్నారు. పేపర్ డ్రెస్ అంటే, చాలా చీప్ అనుకునేరు.
ఈ కాస్ట్యూమ్ కోసం వినియోగించే మెటీరియల్ క్వాలిటీని బట్టి, రేంజ్ పెరిగిపోతుంటుంది. వందలు, వేలు దాటేసి.. లక్షల్లో కూడా ఖర్చు చేసి కొందరు సరికొత్త ట్రెండీ పేపర్ వేర్‌ని ధరించేస్తున్నారు. ప్రధానంగా పార్టీ వేర్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు.
ఆ పేపర్ల మీద రాతల విషయానికొస్తే, కొన్ని రాజకీయ అంశాలు, కొన్ని సినిమా అంశాలతోపాటు, మరికొన్ని నాటీ అంశాలు కూడా వుండేలా జాగ్రత్తపడుతున్నారు. ఇక, ఇక్కడ మనం చూస్తున్న ఫొటోల బుల్లితెర రాములమ్మ శ్రీముఖి పేపర్ డ్రెస్‌లో టూ హాట్ టూ హ్యాండిల్ అనిపిస్తోంది కదూ.!
ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఎప్పటికప్పుడు ఫాలో అవడంలో శ్రీముఖి మిగతా అందాల భామలకు తానేం తీసిపోనని నిరూపిస్తుంటుంది. బిగ్‌బాస్ సీజన్ 3లో శ్రీముఖి కాస్ట్యూమ్స్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
ఇదిలా వుంటే, ఇటు బుల్లితెరపైనా, అటు వెండితెరపైనా.. శ్రీముఖి ఓ రేంజ్‌లో హల్‌చల్ చేసేస్తోంది. అందాల ప్రపంచంలో ఎప్పుడూ ఫ్యాషన్ పరంగా ‘అప్ టు డేట్’ వుండాలన్నది శ్రీముఖి (Sree Mukhi Hot Show) చెప్పే మాట. అందుకేనేమో, ఎప్పటికప్పుడు ఫ్యాషన్ విషయంలో తనను తాను అప్ డేట్ చేసుకుంటూ గ్లామరస్ ప్రపంచంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది శ్రీముఖి.