Vishwak Sen: పాగల్’ సినిమా చేసినంత మాత్రాన విశ్వక్సేన్ అనే నటుడు ‘పాగల్ సేన్’ అయిపోతాడా.?
సిరివెన్నెల సినిమాకి పాటలు రాసిన సీతారామశాస్ర్తి కాస్తా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయినప్పుడు, ‘పాగల్’ సినిమా చేసినందుకు గాను విశ్వక్సేన్ కాస్తా ‘పాగల్ సేన్’ అయితే తప్పేంటీ.?
ఫన్ నోట్లో ఇది వినడానికి బాగానే వుంటుంది. కాస్త సీరియస్ టోన్లో వున్నప్పుడు మాత్రం చాలా దారుణమైన విమర్శ ఇది. అందుకే విశ్వక్సేన్కి ఒళ్లు మండిపోయింది.
టీవీ ఛానెల్లో కూర్చొని జర్నలిస్టు అని చెప్పుకుంటే సరిపోద్దా.? కాస్త బుర్ర వుండాలి కదా.
ఇదా జర్నలిజం.?
జర్నలిస్టు అనగానే, సుప్రీంకోర్టు జడ్జి అనో, దేశానికి ప్రధాన మంత్రి అనో కొంత మంది ఫీలయిపోతుంటారు. తాము డిక్టేటర్స్ అనుకుంటారు.

ఎవరినైనా, ఏమైనా అనేస్తాం.. అడిగేస్తాం.. కడిగి పారేస్తాం.. అంటారు. అనుకుంటారు. అదే భ్రమల్లో బతికేస్తుంటారు.
అంతిమంగా అందరం మనుషులం. ఒకరి అభిప్రాయాల్ని ఇంకొకరు గౌరవించుకోవాలి. కానీ, అవన్నీ పాత కాలపు మాటలైపోయాయ్.
మాస్ కా దాస్ Vishwak Sen విశ్వరూపం.!
విశ్వక్సేన్ మీద ఓ ఛానెల్ న్యూస్ రీడర్ తన నోటి దురదను ప్రదర్శించింది. ఆమెకి అర్ధమయ్యే టోన్లో విశ్వక్సేన్ కూడా తగిన భాషనే వాడి సమాధానమిచ్చాడు.
జర్నలిజం అంటే సెలబ్రిటీల మరుగుదొడ్లలోనూ, పడక గదుల్లోనూ దాక్కొని లొపల జరిగే వ్యవహారాల్ని ప్రపంచానికి చూపించడం.. అనే పిచ్చితనంలో కొందరు జర్నలిస్టులు కొన్ని మీడియా సంస్థలు పెచ్చిపోతున్నాయ్.
Also Read: తూచ్.! Janhvi Kapoor మళ్ళీ అలా అనేసిందేంటీ.!
అలాంటోళ్లకి మాస్ కా దాస్ విశ్వక్సేన్ టోన్లోనే సమాధానం కరెక్టుగా వుంటుందేమో. ఆ సమాధానం గట్టిగా వచ్చేటప్పటికి ‘గెటౌట్ ఫ్రమ్ మై స్టూడియో’ అనేసింది ఆ జర్నలిస్టు.
బతిమాలుకుని విశ్వక్సేన్ని స్టూడియోకి రప్పించుకున్నదెవరు.? కాస్తంత ఇంగితం వుండక్కర్లా.? ఇలా ‘అతి’ చేసిన చాలా మంది జర్నలిస్టులు అదే ఛానెల్ నుంచి మెడ పట్టి గెంటివేయబడ్డ సందర్భాలు బోలెడన్ని వున్నాయ్.
Vishwak Sen, విశ్వక్ సేన్, మాస్ కా దాస్,