Table of Contents
Pawan Kalyan Movies.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమాలు రూపొందించేందుకు నిర్మాతలు ఎందుకు ఎగబడుతుంటారు.?
పవన్ కళ్యాణ్ కోసమే యువ దర్శకులు ఎందుకు సరికొత్త కథలు రాసుకుంటూ, ఆయనతో సినిమాలు తీయాలన్న పట్టుదలతో వుంటారు.?
ఏదన్నా మంచి విషయం పవన్ కళ్యాణ్ ద్వారా చెప్పించగలిగితే, అది ఎక్కువమందికి చేరుతుందన్న ఆలోచన యువ దర్శకుల్లో కనిపిస్తుంటుంది.
కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలతో లాభాలు ఆర్జించడమొక్కటే కాదు, తాము నిర్మించే సినిమా తమ బ్యానర్ వాల్యూ పెంచాలని నిర్మాతలు ఆశిస్తుంటారు. దటీజ్ పవన్ కళ్యాణ్.!
పవన్ కళ్యాణ్ రాజకీయానికి బలయ్యేదెవరు.?
పవన్ కళ్యాణ్ రాజకీయలకు నిర్మాతలు బలి.. అంటూ ఓ బులుగు వైరస్, తనదైన స్టయిల్లో విషం చిమ్మేందుకు ఇంకోసారి ప్రయత్నించింది తాజాగా.
Also Read: ఓ గ్రామ సింహమా.! రాజకీయం అంటే బెట్టింగ్ కాదు.!
ఏ నిర్మాతకైనా అలాంటి భావన వుంటే, అసలు పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించడానికి ఎవరైనా ఎందుకు ముందుకొస్తారు.?
‘వకీల్ సాబ్’ సినిమా విషయాన్నే తీసుకుంటే, విజయవాడ నుంచి హైద్రాబాద్.. దాదాపుగా ప్రతి రోజూ ప్రత్యేక విమానం తిరిగేది పవన్ కళ్యాణ్ కోసం.

అలాగని, ఆ చిత్ర నిర్మాతలు బోనీ కపూర్, దిల్ రాజు.. ఎప్పుడైనా, ఎక్కడైనా ఆందోళన చెందారా.? సినిమా వల్ల నష్టపోయామని ఎక్కడైనా చెప్పారా.?
Pawan Kalyan Movies.. లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అది.!
‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) సినిమా విషయంలోనూ అంతే. పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించడం అనేది తమ జీవితంలో గ్రేటెస్ట్ అఛీవ్మెంట్ అని ఆ చిత్ర నిర్మాతలు వ్యాఖ్యానిస్తే, దర్శకులదీ అదే బాట.!
పవన్ కళ్యాణ్ సినిమాల్ని అడ్డుకునేందుకు ‘బులుగు వైరస్’ నానా రకాలుగా కుట్రలు పన్నుతూనే వుంది. ‘వకీల్ సాబ్’ సినిమాకి సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ‘భీమ్లానాయక్’ సంగతి సరే సరి.
అయినాసరే, పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) చేతిలో ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాలున్నాయ్. పవన్ ఒప్పుకోవాలేగానీ, ఇంకో డజను సినిమాలు లైన్లోకి వస్తాయ్.
బలయ్యేది బులుగు వైరస్ మాత్రమే.!
ఎప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తారోనన్న భయం ఎవరికీ లేదు. కానీ, పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సినిమాలకు గుడ్ బై చెప్పేయొచ్చని అందరికీ తెలుసు. అయినాసరే, పవన్ కళ్యాణ్ విషయంలో నిర్మాతలకీ, దర్శకులకీ అదో క్రేజ్.
Also Read: ప్రజా క్షేత్రంలో గెలిస్తే, ‘తప్పు’ ఒప్పయిపోతుందా.?
అది గిట్టని బులుగు వైరస్, ఇదిగో.. ఇలా చెత్త కథనాల్ని వండి వడ్డిస్తూనే వుంటుంది. ‘బులుగు’ యజమాని విసరే ఎంగిలి మెతులకు ఆశపడే కొన్ని ‘బులుగు’ జంతువులు చేసే దుష్ప్రచారమిది.!
పవన్ రాజకీయాలకి నిర్మాతలు బలి.. అన్నది ఉత్త మాట. నిజానికి, పవన్ కళ్యాణ్ రాజకీయాలకి చచ్చేది బులుగు వైరస్.!