Salman Khan Jacqueline Fernandez.. సల్మాన్ ఖాన్ బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.! అసలు సమీప భవిష్యత్తులో పెళ్ళి చేసుకోవాలన్న ఉద్దేశ్యమేదీ అతనికి వున్నట్లు కనిపించడంలేదు.
సరే, పెళ్ళి చేసుకోవాలా.? వద్దా.? అన్నది సల్మాన్ ఖాన్ వ్యక్తిగతం. కానీ, పెళ్ళి కాకపోతేనేం.. చాలామందితో ఎఫైర్లు నడిపేశాడు సల్మాన్ ఖాన్.
లిస్టులో ఐశ్వర్యారాయ్ నుంచి జాక్వలైన్ ఫెర్నాండెజ్ వరకూ.. చాలామంది అందాల భామలున్నారు. జాక్వెలైన్ ఫెర్నాండెజ్.. సల్మాన్ ఖాన్ లిస్టులో ఇదే చివరి పేరు అవుతుందని అనుకోవచ్చా.? ఛాన్సే లేదు.!
Salman Khan Jacqueline Fernandez ఎక్కడ తేడా కొట్టిందబ్బా.?
ఔను, కొంతకాలంగా సల్మాన్ ఖాన్ – జాక్వెలైన్ ఫెర్నాండెజ్ మధ్య సన్నిహిత సంబంధాలు లేవు. సల్మాన్ ఖాన్‌కి దూరమయ్యాకనే, సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తికి దగ్గరమైంది జాక్వెలైన్.

సుఖేష్ చంద్రశేఖర్ అంటే, ఈడీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కదా.. అతనే.! అతని కారణంగానే జాక్వెలైన్ కూడా ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో.!
ఈ కేసులోంచి తనను తప్పించాల్సిందిగా జాక్వెలైన్, తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ని ఆశ్రయించిందట. కానీ, సల్మాన్ ఖాన్ ఆమెని లైట్ తీసుకున్నాడట.
లైట్ తీసుకున్న సల్మాన్ ఖాన్..
గతంలో చాలామంది అందాల భామలు అనేక వివాదాల్లో ఇరుక్కున్నప్పుడు వారికి సల్మాన్ ఖాన్ అండగా నిలిచాడు. కానీ, అప్పటి పరిస్థితి వేరు.
Also Read: నివేదా థామస్ పెళ్ళంట.! కానీ, ఎప్పుడంట.?
అన్నట్టు, కృష్ణ జింకల్ని వేటాడిన కేసులోనూ, హిట్ అండ్ రన్ కేసులోనూ సల్మాన్ ఖాన్ మీద అభియోగాలు వచ్చినప్పుడు.. ఆయనకు బాసటగా నిలిచారు కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లు. అది వేరే సంగతి.
ఇంతకీ, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ పరిస్థితేంటి.? సల్మాన్ ఖాన్ అయితే ఆమెకు మొహం చాటేసేశాడు. సో, ఆమె ఈ కేసులోంచి ఎలా బయటపడుతుందో ఏమో.!
సల్మాన్ ఖాన్ అభిమానులు మాత్రం, మోసగత్తె జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌ని వదిలించుకుని సల్లూ భాయ్ మంచి పనే చేశాడని అంటున్నారు. అంతలా సల్మాన్ ఖాన్ని జాక్వెలైన్ ఏం మోసం చేసిందబ్బా.?