Bigg Boss Telugu 7.. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అంటాడేంటి అక్కినేని నాగార్జున.! పొరపాటే.. చాలా పెద్ద పొరపాటే అది.!
ఇంతకీ, అసలు విషయమేంటంటే, బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ షురూ అవుతోంది. ఏడో సీజన్ కోసం ఏర్పాట్లు జోరందుకున్నాయి.
కంటెస్టెంట్లు ఎవరు.? ఎప్పుడు ప్రారంభమవుతుంది.? ఎన్ని వారాలపాటు జరుగుతుంది.? ఈసారి ప్రైజ్ మనీ ఎంత.? ఇవన్నీ ముందు ముందు తేలుతాయ్.
Bigg Boss Telugu 7.. ప్రోమో.. డెడ్లీ వరస్ట్.!
తాజాగా, బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌కి సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. అక్కినేని నాగార్జున చింపిరి జుట్టుతో కనిపిస్తున్నాడు ఈ ప్రోమోలో.
ఏదో చెప్పాలనుకున్నాడు.. తడబడ్డాడు.! ఔను, నిజంగానే తడబడ్డాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. కుడి ఎడమైతే.. అంటూ ఏదో చెప్పాడు.. అదెవరికీ అర్థం కాకుండా పోయింది.
ఫ్లాప్.. అట్టర్ ఫ్లాప్.. డిజాస్టర్.. ఏడో సీజన్ సంగతెలా వున్నా, దానికి సంబంధించిన ప్రోమో మాత్రం నిజంగానే చెత్త.!
కంటెస్టెంట్లు ఎవరు.?
కొత్త సీజన్ కంటెస్టెంట్లు ఎవరన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పలానా.. పలానా.. అంటూ బోల్డన్ని పేర్లు తెరపైకొస్తున్న సంగతి తెలిసిందే.
రానున్న రోజుల్లో అన్ని విషయాలపైనా స్పష్టత వస్తుంది. ఆరో సీజన్ చెత్త.. పరమ చెత్త.! అంతకు మించిన చెత్తలా ఏడో సీజన్ వుంటుందని ఆడియన్స్ అయితే ఫిక్సయిపోయారు.
నువ్వొద్దు బాబోయ్.. అంటూ అక్కినేని నాగార్జున మీద బిగ్ బాస్ అభిమానులు గుస్సా అవుతున్నా, నిర్వాహకులు మాత్రం హోస్ట్‌ని మార్చడంలేదాయె.!
Also Read: Taapsee Pannu: గర్భం దాల్చితేనే.. పెళ్ళి చేసుకోవాలె!
ఫాఫం.. నాగార్జున మాత్రం ఏం చేయగలడు.? నిర్వహణ అంత చెత్తగా వుంటే.! కంటెస్టెంట్ల ఎంపిక దగ్గర్నుంచి.. అంతా అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తోంది. ఇదో పరమ రొటీన్ వ్యవహారమైపోయింది.
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్.. అంటాడో సినీ కవి. కానీ, బిగ్ బాస్‌లో అన్నీ కుడి ఎడమైపోతున్నాయ్.. తారుమారైపోతున్నాయ్.. అన్నీ పొరపాట్లే.. ఘోర తప్పిదాలే.!
చివరికి ఓడిపోతున్నారు అటు నిర్వాహకులు, ఇటు ఆడియన్స్.. ఇంకో పక్క కంటెస్టెంట్స్.. అన్నిటికీ మించి అక్కినేని నాగార్జున కూడా.! విన్నర్స్ కూడా నైతికంగా ఓడిపోవడం బిగ్ బాస్ ప్రత్యేకత.