Mrunal Thakur Boy Friend.. ‘సీతారామం’ ఫేం మృణాల్ ఠాకూర్ త్వరలో ‘హాయ్ నాన్న’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్న సంగతి తెలిసిందే.
నేచురల్ స్టార్ నాని హీరోగా ‘హాయ్ నాన్న’ సినిమా తెరకెక్కుతోంది. ఇక, తెలుగులో మొదటి సినిమాతోనే అనూహ్యమైన రీతిలో స్టార్డమ్ సంపాదించేసుకుంది మృణాల్ ఠాకూర్.
ఇదిలా వుంటే, ఓ తెలుగబ్బాయ్‌ని మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పెళ్ళాడనుందంటూ ఆ మధ్యన పెద్దయెత్తున గాసిప్స్ పుట్టుకొచ్చాయ్.
Mrunal Thakur Boy Friend.. పెళ్ళా.? నాకా.? కుర్రాడెవరో చెప్పండి ప్లీజ్.!
నేనెవర్ని పెళ్ళాడబోతున్నానో నాకైనా చెప్పండి ప్లీజ్.. అంటూ మృణాల్ ఠాకూర్ తనదైన స్టయిల్లో స్పందించింది తన మీద వస్తున్న గాసిప్స్ విషయమై.
తాజాగా, మృణాల్ ఠాకూర్ ఓ బాలీవుడ్ సింగర్‌తో ప్రేమలో పడిందంటూ ఊహాగానాలు గుప్పుమంటున్నాయి.

త్వరలోనే వీరిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటవబోతున్నారంటూ ఆ ఊహాగానాలకు మరింత మసాలా ‘అద్దుతున్నారు’ ఔత్సాహికులు.
అయితే, మృణాల్తో ప్రొఫెషనల్ పరిచయం తప్ప, అంతకు మించి ఎలాంటి రిలేషన్ తమ మధ్య లేదని సదరు సింగర్ స్పందించాడు.
Also Read: అర్థం.. అపార్థం.! అనసూయపై ట్రోలింగ్ ఆగని వైనం.!
మరోపక్క, మృణాల్ ఠాకూర్ ఈ గాసిప్స్‌పై స్పందించాల్సి వుంది. అయినా, ప్రేమలో పడితే తప్పేముంది.? ప్రేమను దాచే కాలమా ఇది.? దాయాల్సిన అవసరం అసలే లేదు.
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలోనూ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.