Nabha Natesh Lady Boss.. ఇస్మార్ట్ బ్యూటీతో పెట్టుకుంటే అంతే సంగతులు.! చూశారుగా, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఎంత రఫ్ అండ్ టఫ్‌గా కనిపించిందో.!
ఏమయ్యిందోగానీ, అనూహ్యంగా తెలుగు తెరపైనుంచి మాయమైపోయింది ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (Actress Nabha Natesh).!

ఆ మధ్య ఏదో యాక్సిడెంట్‌కి గురై, భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో.. ఆ కారణంగా సినిమాలకు దూరమయినట్లు నభా నటేష్ చెప్పుకొచ్చింది.
Nabha Natesh Lady Boss.. రీ-ఎంట్రీకి దారేది.?
ప్చ్.. రీ-ఎంట్రీ కోసం సరైన ప్లాట్‌ఫామ్ దొరకట్లేదు నభా నటేష్‌కి.! అయినా, తన ప్రయత్నాలైతే తాను గట్టిగానే చేస్తోంది ఈ బ్యూటీ.!
చూస్తున్నారు కదా.. లేడీ బాస్ గెటప్‌లో నభా నటేష్ (iSmart Beauty Nabha Natesh) ఏ స్థాయి కాన్ఫిడెన్స్ చూపిస్తోందో.! స్క్రీన్ మీద కూడా అంతే కాన్ఫిడెన్స్‌తో.. అంతే ఈజ్‌తో నటించేయగలదు ఈ భామ.

డాన్సుల్లో అయితే నభా నటేష్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆమె చాలా మంచి డాన్సర్.! పోనీ, స్పెషల్ సాంగ్స్ ఏమైనా ట్రై చేయొచ్చు కదా.! చేస్తుందేమోలెండి.!
ఆ సూటూ.. ఆ గ్లామర్ పోటూ.!
అచ్చంగా లేడీ బాస్ గెటప్‌లో.. సూట్ వేసి, మొత్తం కవర్ చేసినా.. నభా నటేష్ ఇస్మార్ట్ గ్లామర్ మాత్రం ఓ రేంజ్‌లో ఎలివేట్ అవుతోంది.
స్టైలిష్ ఆటిట్యూడ్‌తో ఈ ఇస్మార్ట్ భామ పోజులు, కుర్రకారుకి యమా కిక్ ఇచ్చేస్తున్నాయ్.! ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. సరైంది పడితే.. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది నభా నటేష్.!

కానీ, ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చేదెవరు.? అదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్.! ఏ ఫిలిం మేకర్ కన్నో ఈ బ్యూటీ మీద పడకుండా వుంటుందా.? మంచి ఛాన్స్ రాకుండా పోతుందా.?
Also Read: ఖాన్ కాదు, శర్మ.! ఏంటి పాపా నీ గోల.!
పోనీ, వెబ్ సిరీస్‌లలో ట్రై చేస్తో పోలా.? ఆ ప్రయత్నాలూ జరుగుతున్నాయట. జస్ట్ టైమ్ కలిసి రావాలంతే.!
