Home » Pulwama ప్రతీకారం తీర్చుకోవాల్సిందే: Sachin

Pulwama ప్రతీకారం తీర్చుకోవాల్సిందే: Sachin

by hellomudra
0 comments

God of Indian Cricket, Sachin Tendulkar slammed Pakistan again, this time he came with sensational comments about world cup and the match between India and Pakistan (Sachin Tendulkar About Pulwama Pakistan and Cricket).

పుల్వామా ఘటనకు (Sachin Tendulkar About Pulwama, Pakistan and Cricket) భారత సైన్యమెలాగూ ప్రతీకారం తీర్చుకుంటుంది. మరి, పాకిస్తాన్ క్రికెట్ మైదానంలో టీమిండియా చేతుల్లో చావు దెబ్బ తినకపోతే ఎలా.? అక్కడ ఆ సైన్యం.. ఇక్కడ ఈ సైన్యం.. వెరసి, పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోవాల్సిందే.

పాక్ – భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్ అవసరం లేదని చాలామంది భావించొచ్చు. ముష్కరులతో క్రికెట్ ఆడాల్సి రావడం బాధాకరమే. కానీ, తప్పదు.. ముష్కర మూకని మైదానంలోనూ తరిమికొడితేనే, కసి తీరుతుంది. ఇదే మాట, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నుంచి వచ్చింది.. పరోక్షంగా.

ఇండియన్‌ క్రికెట్‌కి (Indian Cricket) సంబంధించి దేవుడంటే సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) మాత్రమే. ‘నేనేమీ గెలుపు, ఓటములకు అతీతుణ్ని కాదు.. నేనే మానవ మాత్రున్నే.. అని సాక్ష్యాత్తు సచిన్‌ టెండూల్కర్‌ చెప్పినా, మేం ఒప్పుకోము. నువ్వే మా దేవుడివి..’ అన్నారు. అంటూనే ఉన్నారు కోట్లాది మంది అభిమానులు.

పరుగుల కోసం కక్కుర్తి పడతాడు. జట్టు కోసం ఆలోచించడు.. అనే విమర్శలు సచిన్‌ మీద చాలానే వచ్చాయి. కానీ జట్టు గెలవడం కోసం సచిన్‌ పడ్డ కష్టం అతనికి మాత్రమే తెలుసు. దేశం మీద అభిమానం కొద్దీ సచిన్‌ని, అతను సరిగా ఆడలేని సందర్భంలో కొందరు విమర్శించారేమో.

క్రికెట్ దేవుడు, భారతరత్నం (Sachin Tendulkar About Pulwama, Pakistan and Cricket)

కానీ ఆట పట్ల సచిన్‌ ఎప్పుడూ అంకిత భావంతోనే వ్యవహరించారు. అందుకే సచిన్‌ భారత క్రికెట్‌కి దేవుడయ్యాడు. ‘భారతరత్నం’గా కితాబులందుకుంటున్నాడు. రికార్డుల్ని సచిన్‌ ఏనాడూ పట్టించుకోలేదు. ఆట తప్ప అతనికి ఇంకో ఆలోచన తెలీదు. అందుకేనేమో రికార్డులు ఆయన ముందు మోకరిల్లాయి. దాసోహం అన్నాయి.

ఇప్పుడీ క్రికెట్‌ దేవుడు (Cricket God) ఓ మంచి మాట చెప్పాడు. ఇండియా – పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరగాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పాడు. ఇలా సచిన్‌ చెప్పడానికి ఓ బలమైన కారణముంది. ఆ కారణమేంటంటే అప్పన్నంగా పాకిస్థాన్‌కి రెండు పాయింట్లు ఇవ్వడం.

ఆడాలి.. ఓడించాలి.. పాకిస్తాన్ పని పట్టాలి

ఒకవేళ ప్రపంచకప్‌లో భారత్‌ కనుక పాకిస్థాన్‌తో (Pakistan) మ్యాచ్‌ ఆడబోననీ భీష్మించుకుని కూర్చుంటే పాకిస్థాన్‌కి రెండు పాయింట్లు వెళతాయి. మన శత్రువుని మన బలంతో పడగొట్టాలి తప్ప మైదానంలో పోరాడాల్సింది పోయి వెనుదిరగడం ద్వారా అతని గెలుపుకు కారణమవగలమా.? ఇది ఓ దేశభక్తునిగా సచిన్‌ సంధించిన ప్రశ్న.

Sachin Tendulkar said that, “India has always come up trumps against Pakistan in the World Cup. Time to beat them once again. Would personally hate to give them two pints and help them in the tournament.”

అంతిమంగా దేశమే నాకు ముఖ్యం. దేశమంతా ఏ నిర్ణయం తీసుకున్నా, మనస్పూర్తిగా స్వాగతిస్తానంటూ సచిన్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ అందర్నీ ఆలోచనలో పడేసింది. ఎన్నో మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ గెలుపుకు అడ్డుకట్ట వేశాడు సచిన్‌. కసితీరా పాకిస్థాన్‌ని ఓడించాడు. ప్రత్యేక పరిస్థితుల్లోనూ సచిన్‌ పాకిస్థాన్‌పై చెలరేగిపోయాడు.

Sachin also said, “Having said that, for me India always comes first, so whatever my country decides, I will back that decision with all my heart.”

పోటీ కాదది, యుద్ధమే.. (Sachin Tendulkar About Pulwama, Pakistan And Cricket)

సచిన్‌ ఒక్కడే కాదు, భారత క్రికెట్‌లో ఇలా పాకిస్థాన్‌ని శత్రుదేశంగా భావించి ఆ జట్టుపై పోటీని యుద్ధంలా భావించిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. వరల్డ్‌ కప్‌లో టీమ్‌ ఇండియాకి, పాకిస్థాన్‌పై తిరుగులేని రికార్డు ఉన్నా, ప్రతీసారి భారత క్రికెటర్స్‌లో ఒకటే కసి కనిపిస్తుంది.

సిరీస్‌ సంగతెలా ఉన్నా, పాకిస్థాన్‌ మీద గెలిచి తీరాలనే కోరుకుంటాడు ప్రతీ ఆటగాడు. ఆ అద్భుతమైన అనుభూతిని భారత క్రికెటర్లు ఈ సారి పొందకపోతే ఎలా.? మైదానంలో భారత క్రికెటర్ల కసిని చూసి తనివి తీరా మనం ఆ గెలుపుని ఆస్వాదించకపోతే ఎలా.?

ఛీ కొట్టించి తీరాల్సిందే..

సరిహద్దుల్లో సైన్యం కొట్టే దెబ్బ మైదానంలో క్రికెటర్లు కొట్టే దెబ్బ పాకిస్థాన్‌కి ఒకేలా తగలాలి. (Sachin Tendulkar About Pulwama, Pakistan and Cricket) ఛీ.! అంటూ పాక్‌ క్రికెటర్లను వారి అభిమానులే ఛీత్కరించుకునేలా చేసే ఆ అద్భుతమైన అవకాశాన్ని మనమెందుకు వదులుకోవాలి. నెవ్వర్‌. ఆ అద్భుతమైన క్షణాల కోసం ఇప్పటినుంచే ఎదురుచూద్దాం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group