Sanya Malhotra Barbie Bomma.. బార్బీ బొమ్మలాంటి అందం ఆమె సొంతం. చేసిన తొలి సినిమా ‘దంగల్’ కోసం రెజ్లర్ పాత్రలో కనిపించింది. అయినా కానీ, అందర్నీ ఆకర్షించింది తన అందంతో.
ఆమె ఎవరో కాదు, ‘దంగల్’ బ్యూటీ సానియా మల్హోత్రా. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన ఈ అందాల బొమ్మ యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో ముంబయ్ చేరింది.
అలా వచ్చిన తొలి సినిమా అవకాశంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాలో సపోర్టింగ్ రోల్ పోషించిన సానియా.. ఆ తర్వాత సోలో హీరోయిన్‌గా ఎదిగింది.
Sanya Malhotra Barbie Bomma.. రొటీన్‌కి భిన్నంగా..
ఫక్తు కమర్షియల్ సినిమాలు కాకుండా.. డిఫరెంట్ కథలను ఎంచుకోవడంలో సానియా తనలోని నటికి ఛాలెంజ్ విసురుతుంటుంది ఎప్పటికప్పుడు.

అలా ఆమె నుంచి పలు విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయ్. సినిమాలతో పాటూ, డాన్స్‌లోనూ సానియాకి మంచి ప్రావీణ్యం వుంది.
ముఖ్యంగా క్లాసికల్ డాన్సులో ప్రత్యేక శిక్షణ తీసుకుంది సానియా మల్హోత్రా. సోషల్ మీడియాలో సానియాకి మంచి ఫాలోయింగ్ వుంది.
అద్దంలో అందాల బొమ్మ..
తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడూ అందమైన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అవి కూడా విభిన్నంగా వుండేలానే చూసుకోవడం సానియా ప్రత్యేకత.
Also Read: ఓ క్రైమ్ వార్త.! ఓ విశ్లేషణ.! మీడియా బాధ్యతారాహిత్యం.!
తాజాగా అద్దంలో సానియా అందాల ఫోటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయ్. అదేంటో అద్దానికీ, అందానికీ వున్న లింకేంటో.!

అందాల భామల్ని ఇట్టే ఆకర్షించేస్తుంటుందలా. అలాగే సానియానీ ఆకర్షించింది. ఈ అద్దంలో ఆమె అందం మరింత రెట్టింపయ్యింది.
ఆ ఉంగరాల జుట్టుతో అందాల కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది సానియా మల్హోత్రా.
