Akkineni Akhil Lenin Trailer.. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ సినిమా బాలారిష్టాల నడుమ, విడుదలకు సిద్ధమయ్యింది. ఎప్పుడో విడుదలవ్వాల్సిన సినిమా ఇది.!
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.! మహాభారతం.. అంటూ మొదలెట్టి, కురుక్షేత్ర యుద్ధంతో సినిమా ముగుస్తుందన్న సంకేతాలు ‘లెనిన్’ ట్రైలర్‌తో ఇచ్చేశారు దర్శక నిర్మాతలు.
సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో అక్కినేని అఖిల్, ‘నేను ఎప్పుడు మాట్లాడాలి.? సినిమానే మాట్లాడాలి.!’ అంటూ, ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు.
బాక్సాఫీస్ మీద అఖిల్ దండయాత్ర చాలా ఏళ్ళుగా కొనసాగుతూనే వుంది. ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ దొరకలేదు అఖిల్‌కి ఇప్పటిదాకా.
హిట్టూ ఫ్లాపూ.. సంగతి పక్కన పెడితే, సినిమా సినిమాకీ చాలా చాలా గ్యాప్ తీసేసుకుంటున్నాడు అఖిల్. చేస్తున్న ప్రతి సినిమా ఆలస్యమవుతూనే వుంది.
తెరంగేట్రం, రీ-ఎంట్రీ, రీ-రీ-లాంచ్.. ఇలా అఖిల్ అక్కినేని విషయంలో, అక్కినేని అభిమానులు తమ అభిమాన హీరో సరైన హిట్టు కోసం ఎదురుచూస్తూనే వున్నారు.
ఇంతకీ, ‘లెనిన్’ ట్రైలర్ ఎలా వుంది.? లెనిన్ అంటే, కమ్యూనిస్ట్ పేరు కదా.. మహాభారతం అంటాడేంటి.? కురుక్షేత్రం అంటాడేంటి.? అంటే, ఏమో.. సినిమాలో కంటెంట్ ఏముందో ఎవరికెరుక.?
ఈ సినిమా కోసం అఖిల్ తన స్లాంగ్ మార్చుకున్నాడు.. కంప్లీట్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్నాడు.. పక్కా పల్లెటూరోడిలా కనిపిస్తున్నాడు అఖిల్.
డాన్సుల్లో, యాక్షన్ ఎపిసోడ్స్‌లో అఖిల్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇరగదీసేస్తాడు. అది వేరే సంగతి. అన్నట్టు, భాగ్యశ్రీ బోర్సే, ఏ సినిమాలో నటించినా, అది ఫెయిల్ అవుతూనే వుంది.
అఖిల్, భాగ్యశ్రీ బోర్సే.. ఇద్దరికీ ‘లెనిన్’ హిట్ చాలా చాలా అవసరం. ట్రైలర్ మరీ అంత గొప్ప ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయలేకపోయింది. సో..సో..గానే సాగింది.
అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ కూడా డల్లుగానే సాగింది ‘లెనిన్’ ట్రైలర్‌లో.!
