స్వరా భాస్కర్.. పరిచయం అక్కర్లేని పేరిది.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కావడం వల్లేనేమో.. ఆమెకు ఇంత పాపులారిటీ. బాలీవుడ్ నటిగా ఓ మోస్తరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న స్వరా భాస్కర్ (Swara Bhaskar controversy queen), ఎప్పుడూ వివాదాలతో సావాసం చేస్తుంటుంది.. అదే ఆమె పాపులారిటీకి కారణమని చెప్పొచ్చేమో.
స్వరా భాస్కర్ (Swara Bhaskar Hot), తన గురించి తాను గొప్పగా చెప్పుకునే క్రమంలో తానే ‘ఇండియన్ సిల్వర్ స్క్రీన్’కి వైబ్రేటర్ పరిచయం చేశానంటుంది. అంతేనా, ట్రోల్స్ చేసేవారికి Employment ఇస్తున్నానని కూడా చెప్పుకుంటుంటుంది స్వరా భాస్కర్. నిజమే, ఏళ్ళ తరబడి ఆమెను ట్రోల్ చేస్తూ వస్తున్నారు చాలామంది. అలా వారందరికీ Employment దొరుకుతోందనుకోవాలేమో.
నిజానికి స్వరా భాస్కర్ వున్నది వున్నట్లుగా మాట్లాడే నైజం గల మహిళ. Dare To Speak అన్నది తన రక్తంలోనే వుందనీ, తాను ఏ విషయమ్మీద అయినా కుండబద్దలుగొట్టినట్లు మాట్లాడతానని చెబుతుంటుంది స్వరా భాస్కర్ (Swara Bhaskar Spicy). అందుకేనేమో, వివాదాస్పద సినిమాలు ఆమె నుంచి ఎక్కువ వస్తుంటాయి.
శృంగార పాఠాలు చెప్పే టీచర్.. స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా కామెంట్స్.. ఇలా ఒకటేమిటి వెండితెరపైనా, నిజ జీవితంలోనూ స్వరా భాస్కర్ (Swara Bhaskar Controversy) నుంచి చాలా వివాదాలే తెరపైకొచ్చాయి.. వస్తూనే వున్నాయి.
సామాజిక అంశాలపై మాత్రం స్వరా భాస్కర్, చాలామంది దృష్టిని ఆకర్షిస్తుంటుంది. అందుకే ఎన్ని వివాదాలున్నా, ఆమెను (Swara Bhaskar controversy queen) ఇష్టపడేవాళ్ళూ చాలామందే వుంటారు.