Tollywood Gossips.. ఏం ఓ సారి పెళ్ళి జరిగితే సరిపోదా.? మళ్ళీ మళ్ళీ జరగాలా.? ఆమె ఓ టాలీవుడ్ హీరోయిన్. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్‌లో కొన్ని సక్సెస్‌లున్నాయ్.. డిజాస్టర్లూ వున్నాయ్. ఇప్పుడైతే పెద్దగా సినిమాలేమీ చేయట్లేదుగానీ, కొన్ని ప్రాజెక్టులైతే డిస్కషన్ స్టేజ్‌లో వున్నాయట.!
విషయమేంటంటే, ఈ బ్యూటీ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతోందట. అందులో వింతేముంది.? అమ్మాయైనా, అబ్బాయైనా పెళ్ళి చేసుకోవాలి కదా.? అఫ్‌కోర్స్.. కొందరైతే పెళ్ళికి దూరం అంటారనుకోండి.. అది వేరే సంగతి.
Tollywood Gossips.. పెళ్ళి చేసుకుంటా.. కానీ, ఇప్పుడు కాదు..
కొన్నాళ్ళ క్రితం తన పెళ్ళి గురించి గాసిప్స్ వస్తే, ‘నా పెళ్ళి శుభలేఖ నాకైనా ఇస్తారా.? ఇవ్వరా.? నన్ను పిలవకుండానే నా పెళ్ళి చేసేస్తారా.?’ అని సెటైరేసిందామె.

ఇక, ఆమెతో పెళ్ళి పీటలెక్కబోయేది ఓ టాలీవుడ్ యంగ్ హీరో అన్నది ఆ గాసిప్స్ సారాంశం. రెండు నెలలకో, మూడు నెలలకో మొహాలు కనిపించకుండా ఈ ఇద్దరి షేడ్స్‌తో గాసిప్స్ పుడుతూ వుంటాయ్.
భలే వుంది కదూ.! గాసిప్స్ రాసేవాళ్ళకి అదో తుత్తి.. అని సినీ జనాలు ఇలాంటి గాసిప్స్ చూసే అనుకుంటుంటారు.
ఆ హీరో కుటుంబం మీద ఏడుపే.!
ఇంతకీ ఎవరా హీరో.? ఎవరా హీరోయిన్.? ఇంకెవరు వరుణ్ తేజ్ ఆ హీరో. హీరోయిన్ విషయానికొస్తే లావణ్య త్రిపాఠి.
Also Read: Waltair Veerayya.. ఓర్నీ.! నువ్వు కూడానా.?
గాసిప్స్‌లో ఎడా పెడా వీళ్ళ పెళ్ళి చేసేస్తున్నారు.! లైట్ తీసుకుందామంటే కుదరదు.. స్పందిద్దామంటే పెంట మీద రాయేసినట్టుంటుంది.! ఇదీ లావణ్య, వరుణ్ తేజ్‌ల పరిస్థితి.
మెగా కుటుంబం మీద అక్కసుతోనే ఇలాంటి గాసిప్స్ పదే పదే సృష్టించబడుతుంటాయేమో.!