Papam Prathap Thiruveer.. సినిమా ప్రమోషన్లు కొత్త కొత్తగా డిజైన్ చేస్తుంటారు.
సినిమా అన్నాక, ఆ మాత్రం కొత్తదనం వుండాలి.. అది కథలో అయినా, కథనంలో అయినా, పబ్లిసిటీ విషయంలో అయినా.!
‘పాపం ప్రతాప్’ సినిమా టీమ్ కూడా కొత్తగా ఆలోచించింది. యువ కథానాయకుడు తిరువీర్ ఈ సినిమాలో ‘టైటిల్ రోల్’ పోషిస్తున్నాడు.!
అయ్యోపాపం.. ఇంతకీ, ప్రతాప్‌కి ఏమయ్యింది.? అది తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.! కానీ, ‘పాపం ప్రతాప్’ పరామర్శ దేనికోసం.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.
Papam Prathap Thiruveer.. పబ్లిసిటీ స్టంట్ బానే వుందిగానీ..
పాపం ప్రతాప్ పరామర్శ సభ.. అంటూ, సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి చిత్ర టీమ్ ఓ క్రియేటివ్ నేమ్ పెట్టింది.! భలే వుంది కదా.!
అబ్బే, ఛండాలంగా వుంది.. అంటున్నవాళ్ళూ లేకపోలేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇదేదో శవ యాత్ర, ఓదార్పు యాత్ర తరహాలో వుందన్న చర్చ కూడా జరుగుతోంది.
ఎవరేమనుకున్నాసరే, సినిమా ప్రమోషన్ల కోసం రకరకాల పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటారు. కొన్ని వర్కవుట్ అవుతుంటాయి.. కొన్ని వికటిస్తుంటాయ్ కూడా.
హీరోయిన్ మీద లేకి కామెంట్ల దగ్గర్నుంచి, హీరో పెళ్ళి పెటాకుల వ్యవహారం దాకా.. కాదేదీ పబ్లిసిటీ స్టంటుకి అనర్హం.. అన్నట్లుంటుంది పరిస్థితి.!
ఓదార్పు యాత్ర కూడా చేస్తారా.?
‘పాపం ప్రతాప్ పరామర్శ సభ’ విషయంలో, ఒకింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.. అదే సమయంలో, సినిమాపై బోల్డంత వెటకారమూ కనిపిస్తోంది.
అన్నట్టు, సినిమాలో హీరోకి ఓ లోపం ఏదో పెట్టారట.. దాని చుట్టూనే సరదా సరదా కథ అల్లారట.. అంటూ, ‘కోర్ పాయింట్’ని వ్యూహాత్మకంగా లీక్ చేసి పారేశారు కూడా.
Also Read: బంగారం భవిష్యత్తేంటి.? లక్షకు పడేనా? రెండు లక్షలకు ఎగబాకేనా.?
ఎలాగోలా, పబ్లిసిటీ అయితే వచ్చింది కదా.! అన్నట్టు, ప్రోమోస్ ఆల్రెడీ జనంలోకి బలంగా వెళ్ళిపోయాయ్. సినిమాకి కావాల్సిన బజ్ కూడా వచ్చేసింది రిలీజ్ ముందర.
కంటెంట్ వుంటే, ఈ పబ్లిసిటీ అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. కంటెంట్‌లో క్వాలిటీ లేకపోతే, ఎన్ని పబ్లిసిటీ స్టంట్లు చేసినా వృధా ప్రయాసే.!
తిరువీర్ సరసన పాయల్ రాధాకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్ 17న ‘పాపం ప్రతాప్’ థియేటర్లలోకి రాబోతున్నాడు.
