Prakash Raj Just Askingu.. ఏదో చెప్పి రావాలట.! ఎవరు చెప్పాలి.? ఏం చెప్పాలి.? ఏం చెప్పి, ఎక్కడికి రావాలి.? ఎక్కడికి వచ్చి, ఏం చెప్పాలి.?
సినీ నటుడు ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా వేదికగా ‘జస్ట్ ఆస్కింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో సంధించిన ప్రశ్న హాస్యాస్పదంగా మారింది.
పూర్తి ట్వీటు సారాంశం ఏంటంటే, “మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి.’’ అని.
పొత్తుతో వస్తున్నారా.? అని ప్రశ్నించారు కాబట్టి, రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం అయి వుంటుంది.!
రాజకీయ పార్టీలన్నాక, వ్యూహాలుంటాయి. సింగిల్‌గా పోటీలోకి వెళ్ళాలా.? పొత్తులు పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్ళాలా.? అన్నదానిపై ఆయా రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాల మేరకు నడుచుకుంటాయి.
Prakash Raj Just Askingu.. రాజకీయమంటే నెంబర్ గేమ్..
అంతిమంగా, రాజకీయాల్లో నెంబర్ గేమ్.. గెలుపోటముల్ని డిసైడ్ చేస్తుంది గనుక, ఆ నెంబర్ గేమ్ చుట్టూనే రాజకీయ పార్టీలు తమ వ్యూహాల్ని రచిస్తుంటాయి.
దశాబ్దాలుగా ఇదే రాజకీయం దేశవ్యాప్తంగా నడుస్తోంది. పొత్తులు దేశ రాజకీయాల్లో కొత్త కాదు. కేంద్రంలో ప్రభుత్వాలు పొత్తులతోనే ఏర్పాటవుతున్నాయి.
రాష్ట్రాల్లోనూ పొత్తులతోనే ప్రభుత్వాలు ఏర్పాటవుతున్న పరిస్థితిని చూస్తుంటాం. ‘అవగాహన’ అంటూ, కొత్త కొత్త పదాలూ వాడుతుంటారు ‘పొత్తు’కి సంబంధించి.
ఇక, ప్రకాష్ రాజ్ ఓ పౌరుడిగా ఈ ప్రశ్న వేస్తే, వేసి వుండొచ్చుగాక. ఎవరికి ప్రశ్న వేశాడో, వాళ్ళ పేర్లను ప్రస్తావించలేనంత పిరికితనం ఎందుకు.?
తెలుగులో ట్వీటేశారు కాబట్టి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల గురించే ఆయన తెగ బాధపడిపోతున్నారనే విషయం అర్థమవుతోంది.
ప్రకాష్ రాజ్ నేరుగా మద్దతిచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా గతంలో పొత్తు రాజకీయాలు చేసింది. పరోక్షంగా ప్రకాష్ రాజ్ మద్దతిస్తున్న వైసీపీ కూడా గతంలో, తెలంగాణలో వామపక్షాల మద్దతు తీసుకుంది.
తమిళనాడులో ప్రకాష్ రాజ్, డీఎంకే పార్టీతో అంటకాగారు. ఆ డీఎంకే, కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన విషయం ప్రకాష్ రాజ్‌కి తెలియదా.?
బహుశా, జన సేనాని పవన్ కళ్యాణ్ మీద అక్కసుతో ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ వేసి వుండొచ్చు. పవన్ కళ్యాణ్‌ని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారా.?
ప్రశ్నించడానికి, ప్రకాష్ రాజ్ ఎవరు.? తెలంగాణలో ఆయనకు ఓటు హక్కు వుందా.? పోనీ, తెలంగాణలో ఏదన్నా రాజకీయ పార్టీ తరఫున ఆయనకి సభ్యత్వం వుందా.?
అయినా సరే, ప్రశ్నించొచ్చు. కానీ, ప్రశ్నించే ముందర ఆ ప్రశ్నకు అర్థం వుండాలి కదా.? సింగిల్‌గా వస్తారో, పొత్తులు పెట్టుకుని వస్తారో.. ప్రకాష్ రాజ్‌కి ఎవరైనా ఎందుకు చెప్తారు.?
Also Read: ప్రజాస్వామ్యమంటే నీకు అంత వెటకారమా ప్రకాష్ రాజ్.?
ప్రకాష్ రాజ్ ఏమైనా మోరల్ పోలీసింగ్ చేస్తున్నారా రాజకీయాలా.? ఆయనకి చెప్పకుండా ఎవరన్నా ఏదన్నా చేస్తే, అది చెల్లదని ప్రకాష్ రాజ్ తీర్పు చెప్పే పరిస్థితుల్లో వున్నారా.?
జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్ వాడేస్తే సరిపోదు, ప్రశ్నించే అర్హత తనకుందో లేదో తెలుసుకుని అడిగితే బావుంటుంది.? అన్నట్టు, గతంలో కర్నాటకలో పోటీ చేశారు ప్రకాష్ రాజ్.
అప్పుడు, దేశంలో ప్రతి ఒక్కరినీ పిలిచి, తాను సింగిల్‌గా పోటీ స్తున్నాడో.. పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాడో అడిగాడా.? అడగలేదాయె.!
కక్కుర్తి.. రీచ్ కక్కుర్తి.! ఇంతకు మించి ప్రకాష్ రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’ ట్వీట్ల వెనుక వేరే విషయమే లేదు. నలుగురూ నవ్విపోదురుగాక ప్రకాష్ రాజ్ కేటి సిగ్గు.?
చెప్పి రండి దొర.. అంటున్నారు ప్రకాష్ రాజ్. ఎక్కడికి రావాలి.? ఎందుకు రావాలి.? దొరని అడుక్కునే బానిస బతుకు నీకెందుకు ప్రకాష్ రాజ్.?
