Home » కాక్రోచ్ జనతా పార్టీ.! దేశంలో ఈ కొత్త బొద్దింకల గోలేంటి.?

కాక్రోచ్ జనతా పార్టీ.! దేశంలో ఈ కొత్త బొద్దింకల గోలేంటి.?

by hellomudra
0 comments
cockroach janata party

Cockroach Janata Party Politics.. బొద్దింకని లక్ష్మీ దేవి పురుగు.. అని అభివర్ణించేవారు ఒకప్పుడు. ఇప్పుడైతే, బొద్దింకల్ని చూస్తే జుగుప్స కలుగుతుంది.. చంపేస్తాం, వెంటనే.!

మార్కెట్‌లో రకరకాల ఆయుధాలున్నాయి బొద్దింకల్ని అంతమొందించడానికి. టెలివిజన్ ఆన్ చేస్తే,

బొద్దింకల్ని నిర్మూలించడానికి ఇవి వాడండి, అవి వాడండి.. అని బోల్డన్ని ప్రకటనలు దర్శనమిస్తాయ్. అసలీ, బొద్దింకల గురించిన చర్చ ఎందుకు జరుగుతోందిప్పుడు.?

Cockroach Janata Party Politics.. దేశంలో బొద్దింకలు పడ్డాయ్.!

దేశంలో దొంగలు పడ్డారు.. అనే మాట తరచూ వాడుతుంటాం. ఈ మధ్య, దేశంలో బొద్దింకలు పడ్డాయ్.. అని చర్చించుకుంటున్నాం.

కాక్రోచ్ జనతా పార్టీ.. ఇదొక సంచలనం.! జెన్ జీ.. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పట్ల ఆకర్షితురాలవుతోంది. ఇటీవల ‘నీట్’ పరీక్షా పత్రం లీక్ వ్యవహారం నేపథ్యంలో, కాక్రోచ్ జనతా పార్టీ హాట్ టాపిక్ అయ్యింది.

దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ, నీట్ పరీక్ష రద్దు వ్యవహారంపై పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

ఎక్కడో విదేశాల్లో వుండి, ఈ కాక్రోచ్ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ప్రారంభించారు కొందరు. అదిప్పుడు, ప్రత్యక్షంగా దేశంలోనే నిరసనలు, ఆందోళనలు జరిగే స్థాయికి వెళ్ళింది.

ఇది కొత్త రాజకీయ పార్టీ అవుతుందా.? గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో.. ఇప్పుడీ కాక్రోచ్ జనతా పార్టీ కూడా, దేశ రాజకీయాల్లో సంచలనం కాబోతోందా.?

దేశంపై దండెత్తుతున్న బొద్దింకలు..

ఏమోగానీ, కాక్రోచ్ జనతా పార్టీ ముసుగులో అసాంఘీక శక్తులు, దేశంపై దండెత్తుతున్నాయన్న వాదన కూడా లేకపోలేదు.

సినీ నటుడు ప్రకాష్ రాజ్ సహా కొంతమంది, ‘లెఫ్టిస్ట్’ భావజాలం కలిగిన వ్యక్తులు, మరీ ముఖ్యంగా హిందూ వ్యతిరేకులు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ పంచన చేరుతుండడం ఆందోళన కరం.

వున్నపళంగా, ఈ కాక్రోచ్ మంద మీద ‘ఎర్ర హిట్’ ప్రయోగించాలంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఎర్ర హిట్ అంటే, బొద్దింకల్ని నిర్మూలించడానికన్నమాట.

ప్రజా స్వామ్యంలో ప్రశ్నించడం అనేది ఓ హక్కు, బాధ్యత కూడా. ప్రశ్నించే ముసుగులో, సంఘ వ్యతిరేక శక్తుల్ని పెంచి పోషిస్తే మాత్రం, అది సమర్థనీయం కాదు.

ఇంతకీ, ఈ బొద్దింకల హడావిడి ఎన్నాళ్ళు.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group