Kodali Nani Gottam Politics.. రాజకీయాలన్నాక విమర్శలు సహజం.! రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించే క్రమంలో తమను తాము హీనాతిహీనంగా చిత్రీకరించుకునేవాళ్ళని ఏమనాలి.?
ఏమంటాం.? కొడాలి నాని లాంటోళ్ళు.. అనాల్సి వస్తుందేమో.! మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్‌ని ‘కౌన్ కిస్కా గొట్టంగాడు’ అనేశారు కొడాలి నాని.
సరే, చంద్రబాబు అన్నా.. నారా లోకేష్ అన్నా.. ఇష్టం వుండదు గనుక కొడాలి నాని అలా అన్నారనుకుందాం.! కానీ, వైఎస్ జగన్ హయాంలో పని చేసిన మంత్రులంతా ‘కౌన్ కిస్కా గొట్టంగాళ్ళే’ అంటారేంటి కొడాలి నాని.?
వైఎస్ జగన్ స్థాయి.. నారా లోకేష్ స్థాయి.. ఈ ఇద్దరి స్థాయి గురించి పోల్చి చెప్పే క్రమంలో, ‘నాలాంటి కౌన్ కిస్కా గొట్టంగాళ్ళు 40 మందికి మంత్రులుగా అవకాశమిచ్చారు జగన్’ అని కొడాలి నాని సెలవిచ్చారు.
కొడాలి నాని చెప్పిన లిస్టులో, బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలున్నారు.. రోజా తదితర మహిళా నేతలు కూడా వున్నారు. విద్యాధికులు కూడా వున్నారు.
ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా, మంత్రుల్ని నియమించుకోక తప్పదు. మంత్రులు, వారి వారి శాఖలు.. ఇదంతా పరిపాలనకు సంబంధించిన వ్యవహారం.
చంద్రబాబు మంత్రి వర్గంలో నారా లోకేష్ వున్నారు.. కూటమి ప్రభుత్వం గనుక పవన్ కళ్యాణ్ కూడా వున్నారు. సామాజిక సమీకరణాల లెక్కలేసుకుని మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
వైఎస్ జగన్ దృష్టిలో కొడాలి నాని తనను తాను కౌన్ కిస్కా గొట్టంగాడి కింద ఊహించుకుంటే.. అది ఆయనిష్టం.! వైసీపీ హయాంలో మంత్రులుగా పని చేసినవాళ్ళని కూడా ‘కౌన్ కిస్కా గొట్టంగాళ్ళు’ అనడం ఎంతవరకు సబబు.?
మంత్రులంటే, రాజ్యంగ బద్ధమైన పదవులు. హోంమంత్రిత్వ శాఖ సహా, వివిధ కీలకమైన శాఖలుంటాయి. ఆ మాటకొస్తే, ప్రతి శాఖా ప్రత్యేకమైనదే.
పదవి అంటే బాధ్యత.! ఎవరు ఏ పదవిలో వున్నా ప్రజా సేవ కోసమే ఆ పదవులు. అలాంటి మంత్రుల్ని ఉద్దేశించి కౌన్ కిస్కా గొట్టంగాళ్ళని అభివర్ణించడమేంటో.!
కొడాలి నాని ఇలా బోర్డర్ దాటేయడం ఇదే కొత్త కాదు.! అలవోకగా నోరు జారేస్తుంటారాయన. ఇదే, ఇలా వైసీపీ నాయకులు నోరు జారడమే వైసీపీ కొంప ముంచేస్తోంది.
అధికారంలో వున్నప్పుడు కొడాలి నాని విర్రవీగిపోయారు.! అధికారం పోయాక, కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా వున్నారు.! అనారోగ్య సమస్యల కారణంగా కూడా ఈ తరహా వివాదాలకు దూరంగా వున్నారు కొడాలి నాని కొన్నాళ్ళపాటు.
మళ్ళీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. యాక్టివ్ అవడమంటే, నోటి దూల ప్రదర్శించి, రాజకీయ ప్రత్యర్థుల్ని తూలనాడటం, సొంత పార్టీని ఇరకాటంలో పడేయడమేనేమో.!
– yeSBee
