IIT Bombay Professor Resigns.. ఐఐటీ ముంబై (బాంబే) గురించి తెలుసు కదా.? దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థ.! ఐఐటీ అంటేనే నెంబర్ వన్.. మళ్ళీ ఐఐటీలలో ముంబై ఐఐటీ నెంబర్ వన్.!
ఆషామాషీగా ఐఐటీముంబైలో సీట్ వచ్చెయ్యదు.! జేఈఈ-మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ విజయం సాధించాలి.
ఏదో ఆషామాషీగా జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ వస్తే సరిపోదు.. చాలా చాలా మంచి ర్యాంక్ వస్తేనే, ఐఐటీ ముంబైలో సీటు వస్తుంది. అలా ఓ విద్యార్థి సీటు సాధించాడు.
అంత కష్టపడి సీటు సాధించిన విద్యార్థి, పరీక్షల్లో ‘కాపీ’ కొట్టే ప్రయత్నం ఎందుకు చేసినట్లు.? అది కూడా, క్వశ్చన్ పేపర్ని మొబైల్ ద్వారా ‘చాట్ జీపీటీ’కి ఇవ్వడమేంటి సమాధానాల కోసం.?
ఇదే ప్రశ్నించాడు, ఇన్విజిలేటర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్. అంత పెద్ద తప్పిదానికి విద్యార్థి పాల్పడితే, ప్రొఫెసర్ మందలించకుండా వుంటారా.?
ప్రొఫెసర్ మందలించారు.. ఐఐటీ అడ్మినిస్ట్రేషన్ ఈ అంశంపై చర్చించింది.. ఇంకా, ఆ విద్యార్థిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కానీ, ఈలోగా సదరు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అంతే, ఐఐటీ ముంబైలో అలజడి.! చివరికి ప్రొఫెసర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రొఫెసర్ రాజీనామాని ఐఐటీ ముంబై డైరెక్టర్, ఆమోదించాల్సి వచ్చింది.
అదీ ఆమోదించినట్లు, విద్యార్థుల సమక్షంలో డైరెక్టర్ ప్రకటించాల్సి రావడం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.
ఐఐటీ ముంబైలో చేరేందుకు విద్యార్థి ఎంత కష్టపడ్డాడో, అంతకు మించి.. పది రెట్లు.. వంద రెట్లు కష్టపడితేనే కదా, సదరు ప్రొఫెసర్, ఐఐటీ ముంబైలో విద్యార్థులకు పాఠాలు చెప్పే స్థాయికి వచ్చింది.?
ఇక్కడ, ‘కులం కోణం’, ఆ ప్రొఫెసర్ చేత రాజీనామా చేయించడం మరింత శోచనీయం. ఇందులో ప్రొఫెసర్ తప్పేముంది అసలు.?
ప్రొఫెసర్ చేసింది తప్పయితే, ఇకపై పోటీ పరీక్షలు అనవసరం. ఐఐటీ లాంటి అత్యున్నత విద్యా సంస్థల్లోనే కాదు, అన్ని చోట్లా పరీక్షల సందర్భంగా, విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులో వుంచెయ్యాలి.
అసలు పరీక్షలే అనవసరం అంటోంటే, మళ్ళీ మొబైల్ ఫోన్లు, ల్యాప్ ట్యాఫ్లు ఎందుకు.? అసలు చదువులే ఎందుకు.. దండగమారి వ్యవహారం కదా.?
అట్రాసిటీ కేసుల్ని ప్రొఫెసర్ల మీద ఇలాంటి సందర్భాల్లో పెట్టడం ద్వారా సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నట్లు.? అసలంటూ ఈ రిజర్వేషన్ల వ్యవస్థే లేకపోతే ఎంత బావుంటుందో కదా.?
విద్యార్థి బలవన్మరణం అత్యంత బాధాకరం. కానీ, దానికి ప్రొఫెసర్ని నిందించడం హాస్యాస్పదం.