ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? రియా చక్రవర్తి (Rhea Chakraborty New Love Story) సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేయడం కాస్త వైరల్ అయిపోయింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణం తర్వాత రియా చక్రవర్తి వివాదాస్పద రీతిలో వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే.
రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ ప్రియురాలు కావడమే అందుకు నిదర్శనం. కొన్నాళ్ళపాటు సుశాంత్ సింగ్ ‘ఫ్లాట్’లో రియా వుండడం, ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు పెరగడం, రియా.. సుశాంత్ ఫ్లాట్ ఖాళీ చేశాక.. సుశాంత్, ఆ ఫ్లాటులోనే అనుమానాస్పద రీతిలో మరణించడం తెలిసిన సంగతులే.
ఇంకోపక్క రియా చక్రవర్తిపై డ్రగ్స్ కేసు కూడా నమోదయ్యింది. ఆ కేసు ఇంకా కొనసాగుతూనే వుంది. అరెస్టు, బెయిల్.. ఇలా కొన్నాళ్ళపాటు రియా చక్రవర్తి పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇన్నాళ్ళకు మళ్ళీ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుంది టెన్షన్స్ నుంచి రియా చక్రవర్తి.
తన స్నేహితురాలు, నిర్మాత హీరా పర్మార్ నందానితో కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది రియా చక్రవర్తి (Rhea Chakraborty New Love). బెడ్ మీద ఇద్దరూ వెల్లకిలా పడుకుని వున్నారు.. జుట్టుని మంచం మీద నుంచి కిందికి వాల్చేశారు. ఇద్దరూ చేతులతో లవ్ సింబల్ చూపించారు.
ఇంకేముంది, విపరీతమైన ట్రోలింగ్ మళ్ళీ షురూ చేశారు నెటిజన్లు.. అదేనండీ సుశాంత్ అభిమానులు. స్నేహితురాలితో ప్రేమ కబుర్లు చెబుతోందేంటబ్బా.? అన్నదే వాళ్ళ డౌట్. ‘లవ్ ఈజ్ ఫరెవర్’ అంటూ ‘Love is a fabric which never fades, no matter how often it is washed in the water of adversity and grief’- Rober Fulghum’ ఈ కొటేషన్ షేర్ చేసింది.