Home » ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్.! ఎప్పుడో జరగాల్సింది.!

ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్.! ఎప్పుడో జరగాల్సింది.!

by Mudra369 Editorial Desk
0 comments
Mahendra Singh Dhoni About Playing IPL T20

MS Dhoni IPL Retirement.. ఎట్టకేలకు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచీ ధనాధన్ ధోనీ రిటైర్మెంట్ తీసుకున్నట్లయ్యింది.!

అంతర్జాతీయ క్రికెట్‌కి ఎప్పుడో గుడ్ బై చెప్పేసిన మహేంద్ర సింగ్ ధోనీ, తాాజాగా ఐపీఎల్‌కి కూడా గుడ్ బై చెప్పక తప్పలేదు.

గత కొన్నాళ్ళుగా ధోనీ మీద ‘వైట్ ఎలిఫెంట్’ అన్న ముద్ర పడిపోయింది. చెన్నయ్ జట్టులో కొనసాగుతున్నా, మైదానంలో తనదైన ప్రతిభ చూపలేకపోతున్నాడు.

ఈ క్రమంలో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా వుంటున్నాడు.. ఒకటీ అరా మ్యాచ్‌లలో మాత్రమే ఆడుతున్నాడు. మధ్యలో వేరే జట్టు తరఫున కూడా ఆడాడు ఎంఎస్ ధోనీ.

MS Dhoni IPL Retirement.. వన్ అండ్ ఓన్లీ దోనీ..

ఇండియన్ ప్రీమియర్ లీగల్‌లో చెన్నయ్ టీమ్‌కి వున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకే ఇతర జట్టుకీ లేదన్నది నిర్వివాదాంశం. ఆ జట్టులో మళ్ళీ ధోనీనే సూపర్ హీరో.!

వయసు మీద పడ్డంతో, మైదానంలో చురుగ్గా కదల్లేకపోతున్నాడు ధోనీ. అయినాగానీ, అభిమానులను అలరించేందుకు అప్పుడప్పుడూ తనదైన మెరుపులు మెరిపిస్తూ వచ్చాడు.

కానీ, తన మెరుపులు జట్టు విజయానికి ఉపయోగపడకపోవడం, కేవలం పబ్లిసిటీ కోసమే ధోనీ ఆడుతున్నాడన్న విమర్శలు రావడం.. వెరసి, ధోనీ రిటైర్మెంట్ తీసేసుకున్నాడు.

ఒకప్పుడు పొడుగాటి జుట్టుతో వికెట్ల వెనకాల మహేంద్ర సింగ్ ధోనీ చేసిన సందడి అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ సంచలనం. అటు వికెట్ల వెనకాల, ఇటు బ్యాట్‌తో వికెట్ల ముందు.. ధోనీ విధ్వంసం.. అంతా ఇంతా కాదు.

ధోనీ రివ్యూ సిస్టమ్..

భారత జట్టుకి తిరుగులేని విజయాల్ని అందించిన మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.! అన్ని ఫార్మాట్లలోనూ అత్యద్భుత విజయాల్ని టీమిండియాకి కెప్టెన్‌గా అందించాడు ధోనీ.

డీఆర్ఎస్ అంటే, ధోనీ రివ్యూ సిస్టమ్.. అనేంతలా, థర్డ్ అంపైరింగ్ విషయంలో తనదైన ముద్ర వేశాడు ధోనీ.! ధోనీ చెబితే, థర్డ్ అంపైర్ ఒప్పుకోవాల్సిందే.. అన్నట్లుండేవి ధోనీ అంచనాలు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుపులకి అదనం ఐపీఎల్ మెరుపులు. ధోనీ హెలికాప్టర్ షాట్‌లో అంతర్జాతీయ క్రికెట్ కంటే, ఐపీఎల్ ద్వారానే అభిమానుల్ని మరింతగా అలరించాయన్నది నిర్వివాదాంశం.

ఆటగాడు కాదిక.. మెంటార్ ఇకపై..

ఏదిఏమైనా, ఎప్పుడో జరగాల్సిన రిటైర్మెంట్ ఇప్పుడు ప్రకటించబడింది అంతే.! అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌ని మళ్ళీ మైదానంలో చూడలేకపోతున్నామని ఆవేదన చెందడం సహజమే.

క్రికెట్ ఎందరో స్టార్స్‌ని చూసింది. మహేంద్ర సింగ్ దోనీ కూడా ఓ స్టార్ అంతే.! కాకపోతే, తనకంటూ సెపరేట్ స్టార్‌డమ్ క్రికెట్‌లో ధోనీ సంపాదించుకున్నాడు.

ఇదిలా వుంటే, ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుకి మెంటార్‌గా వ్యవహించనున్నాడు ఇకపై.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Most viewed

trending

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group