Home » రాయలసీమ దాటి, ‘పోటీ’ చేసే ధైర్యముందా వైఎస్ జగన్‌కి.?

రాయలసీమ దాటి, ‘పోటీ’ చేసే ధైర్యముందా వైఎస్ జగన్‌కి.?

by hellomudra
0 comments
Ys Jagan Mohan Reddy

Ys Jagan Pulivendula AP.. కాపు సామాజిక వర్గం బలంగా వున్న పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారంటూ గతంలో పెద్దయెత్తున వైసీపీ దుష్ప్రచారం చేసింది.

అదే కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం (ఇప్పుడాయన తన పేరుని పద్మనాభ రెడ్డి‌గా మార్చుకున్నారు)తో పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఉద్యమించేలా చేశారు వైఎస్ జగన్.

అంతేనా, వైసీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలతో, పవన్ కళ్యాణ్‌ని నానా రకాల బూతులూ తిట్టించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలే కాదు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి ‘రెడ్డి’ సామాజిక వర్గ నేతలతోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ని తిట్టించారు.

ఈ మధ్యనే, సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో ఓ యూ ట్యూబ్ ఛానల్‌లో పవన్ కళ్యాణ్‌ని ‘వాడు, వీడు..’ అంటూ తిట్టించారు వైఎస్ జగన్.

ఈ క్రమంలోనే, జన సేన నేత పంతం నానాజీ, ఒకింత ముందడుగు వేసి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘వాడు, వీడు’ అనేశారు. నిజానికి, రాజకీయాల్లో భాష ఒకింత పద్ధతిగా వుండాలి ఎవరికైనా.

రోజా, కొడాలి నాని లాంటి వైసీపీ నేతలైతే ‘లం..’ భాషని కూడా విచ్చలవిడిగా వాడేశారు గతంలో, రాజకీయ ప్రత్యర్థులపై. అది వేరే చర్చ.

బూతులు, తిట్ల వ్యవహారాల్ని పక్కన పెడితే, పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి సంకటంగా మారాయిప్పుడు. ‘పులివెందుల దాటి ఏపీలో ఎక్కడైనా జగన్ పోటీ చేయగలరా.?’ అన్నది ఆయన ప్రశ్న.

గతంలో కడప ఎంపీగా పని చేశారు వైఎస్ జగన్. ఆ తర్వాత పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితమైపోయారు.

2019-2024 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ జగన్, సమీప భవిష్యత్తులో పులివెందుల దాటి, ఏపీలో ఏ ఇతర నియోజకవర్గంలోనూ పోటీ చేసే అవకాశం లేదు.

కొందరు రాజకీయ నాయకులు కొన్ని నియోజకవర్గాలకు అలా పరిమితమైపోతారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు పరిమితమైపోయిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ అలా కాదు, గాజువాక అలాగే భీమవరం నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేశారు, రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. పిఠాపురంలో గెలిచారు.

వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా.? ఇంకో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.

Also Read: తెలిసో.. తెలియకో.! ఇరవై మూడేళ్ళ చిన్న పిల్లాడి నేర చరిత్ర.!

పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా ఏ నియోజకవర్గంలో అయినా పోటీ చేయగలరు. ఆయనకున్న వెసులుబాటు అలాంటిది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలా కాదు. ఆయన పులివెందుల దాటి బయటకు రాలేరు.

జన సేన నేత పంతం నానాజీ సవాల్‌ని వైఎస్ జగన్ స్వీకరిస్తే, అంటే పులివెందుల దాటి వైఎస్ జగన్ వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తే, రాజకీయ సమీకరణాలు ఒకింత ఆసక్తిగా మారతారు.

కానీ, అంత రిస్క్ వైఎస్ జగన్ తీసుకునే అవకాశమే లేదన్నది నిర్వివాదాంశం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group