రాధికా ఆప్టేకి (Radhika Apte) సినిమాల్లో న్యూడ్‌గా నటించడం కొత్తేమీ కాదు. న్యూడ్‌గా నటించడాన్ని సమర్థించుకోవడం కూడా రాధికా ఆప్టేకి బాగానే తెలుసు. తెలుగులో ‘రక్తచరిత్ర’ (Raktha Charitra), ‘లెజెండ్’ (Legend Balakrishna), ‘లయన్’ (Lion Balakrishna) తదితర సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే. తాజాగా ‘వెడ్డింగ్ గెస్ట్’ (Wedding Guest) అనే ఇంగ్లీష్ సినిమాలో దేవ్ పటేల్‌తో కలిసి న్యూడ్‌గా రొమాన్స్ పండించేసిన రాధికా ఆప్టే, ఆ వీడియో లీక్ కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.
ఇంతకీ, ఆ వీడియో బయటకు రావడం పట్ల అభ్యంతరం ఆమెకు లేదట. లీక్ అయిన వీడియో తన పేరుతో ప్రచారంలోకి రావడమే రాధికా ఆప్టేకి అసలు సమస్య అట. గతంలో ‘పర్చేద్’ (Parched) అనే సినిమా తాలూకు వీడియో కూడా ఇలానే బయటకొచ్చింది. అందులోనూ ఆమె నగ్నంగా నటించేసిన విషయం విదితమే.
”రాధికా ఆప్టే (Radhika Apte Hot) న్యూడ్ వీడియో అంటున్నారు కదా, నాతోపాటే ఆ సీన్‌లో వున్న దేవ్ పటేల్‌కి సంబంధించిన న్యూడ్ వీడియో అని ఎందుకు అనడంలేదు.?’ అని ప్రశ్నిస్తోంది రాధికా ఆప్టే. న్యూడ్‌గా దేవ్ పటేల్ ఆ వీడియోలో కన్పించి వుంటే, బహుశా దేవ్ పటేల్ న్యూడ్ వీడియో అనే పిలిచేవాళ్ళమేమో. కానీ, అందులో రాధికా ఆప్టే న్యూడ్‌గా కన్పించింది.
సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడితో కథ ఆపేస్తే ఆమె రాధికా ఆప్టే (Radhika Apte) ఎందుకు అవుతుంది.? రాధికా ఆప్టే న్యూడ్ వీడియోల్ని నెటిజన్లు వైరల్ చేస్తున్నారట. అందుకని, మొత్తం సమాజాన్ని ‘సైకో సమాజం’గా అభివర్ణించేసిందామె. హవ్వ, నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.. అని జనం ఆమె గురించి అనుకుంటున్నారుగానీ.. ఆమెకే వాస్తవం అర్థం కావట్లేదు.
సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ చేయడం సర్వసాధారణం. అది కాస్తా హద్దులు దాటేసింది. ట్రెండ్ మారింది కదా.! ఆ మాటకొస్తే న్యూడ్ ట్రెండ్ అనేది ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో వున్నదే. కానీ, రాధికా ఆప్టేలా (Radhika Apte) మరీ ఇంత వల్గర్‌గా ఎవరూ వ్యవహరించిన దాఖలాల్లేవనీ, మరీ ముఖ్యంగా.. నగ్నంగా నటించడాన్ని సమర్థించుకునే క్రమంలో సొసైటీని ‘సైకో’గా అభివర్ణించడం తగదనీ పలువురు అభిప్రాయపడ్తున్నారు.